Sunday, February 16, 2025
Homeజిల్లాలుఅనంతపురంఆరోగ్య కార్యకర్తకు ఉత్తమ అవార్డు

ఆరోగ్య కార్యకర్తకు ఉత్తమ అవార్డు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ నియోజకవర్గం కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న రమేష్ ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని  జిల్లా కేంద్రం లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి  డాక్టర్ ఈ.బి. దేవి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా అవార్డు తీసుకున్న రమేష్ మాట్లాడుతూ తనకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని తనను ఉత్తమ ఆరోగ్య కార్యకర్తగా ఎంపిక చేసిన జిల్లా వైద్యాధికారి ఈబి దేవికి సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు