టూ టౌన్ సీఐ రెడ్డప్ప
విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో నారాయణస్వామి (35) తో పాటు మరో ముగ్గురు దొంగతనం చేయడానికి వెళ్లారు. ఈ సందర్భంలో ఓ ఇంటిలో దొంగతనం చేస్తుండగా కుటుంబ సభ్యులు గమనించి కేకలు వేయడంతో స్థానిక ప్రజలు గుమికూడి ఆ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. దొంగలు పరిగెత్తడంలో కేతిరెడ్డి కాలనీ ముందు రైల్వే స్తంభం కు నారాయణస్వామి తగలడంతో, జారి కింద పడ్డాడు. తదుపరి కేతిరెడ్డి కాలనీ ప్రజలు చెట్టుకు కట్టేసి డైల్ 100 కు ఫోన్ చేశారు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న 2 టౌన్ సీఐ రెడ్డప్పతోపాటు సిబ్బంది అక్కడికి చేరుకొని నారాయణస్వామిని వైద్య చికిత్సల నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య చికిత్సలు పొందుతూ తలకు తీవ్రంగా గాయం కావడంతో దొంగ మృతి చెందాడని తెలిపారు. దొంగతనం చేయడానికి నారాయణస్వామి తో పాటు మరో ముగ్గురు బళ్లారి పట్టణంలోని నగిరికేరే అను ఏరియాకు సంబంధించిన వారు అని విచారణలో తేలిందని తెలిపారు. చెట్టుకు కట్టేసి మృతుని కొట్టారా? లేదా అన్న విచారణ చేపట్టినట్లు తెలిపారు. తదుపరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతునికి వివాహమయ్యింది, కానీ భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలిపారు.
దొంగతనం చేసే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి ఆసుపత్రిలో మృతి
- Advertisement -


