Homeజిల్లాలుపశ్చిమ గోదావరిగణతంత్ర దినోత్సవ వేడుకలకు తోట కృపామణి

గణతంత్ర దినోత్సవ వేడుకలకు తోట కృపామణి

- Advertisement -

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు దేశమంతా జరుపుకునే భారత దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా పాల్గొనే అరుదైన అవకాశం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం గ్రామానికి చెందిన తోట కృపామణికి దక్కింది. ఈ మేరకు జనవరి 26 న జరిగే 77 వ గణతంత్ర వేడుకలకు అతిధిగా హాజరుకావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శి వాకటి అరుణ నుంచి ఆమెకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించారు. ప్రస్తుతం కృపామణి ఆంధ్ర ప్రదేశ్ స్త్రీ నిధి బ్యాంక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఏలూరు జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇప్పటికే కనకాద్రిపురం గ్రామంలో ఆమె తయారు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తులు ఈ గ్రామం పేరు ప్రపంచ ఫుడ్ ఫెస్టివల్ లో మారు మ్రోగింది. ఈ విధంగా రెండు సార్లు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. అంతేగాక నాబార్డు ద్వారా ఉత్తమ మహిళా ఎంటర్ ప్రేన్యూర్ అవార్డు అందుకున్న కృపామణిని గత ఏడాది జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి జిల్లా తరుపున సత్కరించారు. ఇప్పుడు దేశ రాజధానిలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం రావటం పట్ల తోట కృపామణితో పాటు ఆమె భర్త, సంఘ సేవకుడు టి.యన్.స్నేహన్ హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి అవకాశం కల్పించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, సెర్ప్ సీ. ఇ. ఓ కరుణ , జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ్ రాజ్ , డీపీఎం లకు, ఎపిఎమ్ లకు కృపామణి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు