విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; కేంద్ర పార్టీ పిలుపుమేరకు బిజెపి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో బుధవారం తిరంగా యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ముందు స్వతంత్ర సమరయోధుల పార్కులో స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుభ్ర పరిచి వారికి నివాళులర్పించారు. అనంతరం తిరంగా యాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించారు . ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వయంగా బైక్ నడుపుతూ రాలి ప్రారంభించారు .ఈ ర్యాలీ స్వతంత్ర సమరయోధుల పార్క్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా దేవిచౌక్, కంబాల చెరువు సెంటర్, సి టి ఆర్ ఐ, నారాయణపురం వాటర్ ట్యాంక్ రోడ్, నాగమ్మ తల్లి గుడి , వైట్ హౌస్ మీదుగా రామాలయం జంక్షన్ వరకు సాగింది, అనంతరం అక్కడ స్వసంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకు పూల మాలలు నివాళులర్పించారు. భారత్ మాతాకీ జై భారత్ మాతాకీ జై నినాదాలతో వీధి వీధి మారుమోగుతూ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, మున్ని కృష్ణ ,నర్సిపల్లి హారిక, ఎనుముల రంగబాబు , రొంగల గోపి శ్రీనివాస్, యానాపు యేసు, రజిని , వీరాంజనేయులు ,రవిశంకర్ కందికొండ రమేష్ కాలేపు సాయిరాం ,కిరణ్, మరి కుర్తి కుమార్ యాదవ్ ,తగరం సురేష్ ,లలిత్ కుమార్ జైన్ , కురగంటి సతీష్, బూర రామచంద్రరావు ,అతిరం కాకరాల పవన్ కుమార్, మండల అధ్యక్షులు అధికార లక్ష్మి, ఎర్ర నాగదేవి, మట్ట నాగబాబు ,ఎన్ సత్యనారాయణ ,శివ ,రమేష్ కొల్లాపూర్ శీను, రామారావు, మనోజ్ కుమార్ ,పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు
బిజెపి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర బైక్ ర్యాలీ
- Advertisement -
RELATED ARTICLES


