Friday, November 22, 2024
Homeజిల్లాలుపంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ

పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ జయరాముడు ఆధ్వర్యంలో, ఎంపీపీ శ్రీ విద్య అధ్యక్షతన గురువారం పంచాయతీల అభివృద్ధి, ప్రణాళికలు2025-26 సంబంధించి సర్పంచులు, ఎంపిటిసిలు, విఓఏలు, డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ సాయికుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీల్లో ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులు, గ్రామ పంచాయతీల ఆదాయ వనరులను కలుపుకొని చేపట్టాల్సిన పనులను రూపొందించుకోవాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ముత్తమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయితీ కార్యదర్శులు, వివోఏలు, డిజిటల్‌ అసిస్టెంట్స్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు