Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅద్భుత జ్ఞాపకశక్తి-దాని రహస్యాలు.

అద్భుత జ్ఞాపకశక్తి-దాని రహస్యాలు.

- Advertisement -

అవగాహన సదస్సుకు విశేష స్పందన.. మెమొరీ ఇండియన్ రాజు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి ఆవరణములోని కళ్యాణ మండపంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న అద్భుత జ్ఞాపకశక్తి దాని రహస్యాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన రావడం జరిగిందని మెమొరీ ఇండియన్ నిర్వాహకులు రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి అవగాహన సదస్సు రెండవసారి నిర్వహించడం జరిగిందని తెలిపారు. రెండవసారి కు గాను ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు మొత్తం 70 మంది హాజరై తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు మూడు బ్యాచ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, మొత్తం ఈ అవగాహన సదస్సు ఉచితంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అద్భుత జ్ఞాపకశక్తికి పాటించాల్సిన విధి విధానాలపై బ్లాక్ బోర్డ్ ద్వారా మరిన్ని వివరాలను తెలియజేశామని తెలిపారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల అక్కడ వచ్చిన వారు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది గంగిరెడ్డి, కిరణ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు