Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉద్యోగులు తమ వృత్తిని దైవంగా భావించినప్పుడే నిజమైన సంతృప్తి

ఉద్యోగులు తమ వృత్తిని దైవంగా భావించినప్పుడే నిజమైన సంతృప్తి

- Advertisement -

తహశీల్దార్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం; ఉద్యోగులు తమ వృత్తిని దైవంగా భావించినప్పుడే నిజమైన సంతృప్తి లభిస్తుందని తాసిల్దార్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో 70 ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జెండాను తాసిల్దార్ ఆవిష్కరించగా, సిబ్బంది అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారి మార్గంలో పయనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్డిటి ఈశ్వరయ్యతో పాటు కార్యాలయ సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు