Tuesday, July 15, 2025
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌కు కొన్ని రకాల ఆయుధాల సరఫరా నిలిపివేత..ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం

ఉక్రెయిన్‌కు కొన్ని రకాల ఆయుధాల సరఫరా నిలిపివేత..ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం

ఉక్రెయిన్‌కు అందిస్తున్న ఆయుధ సహాయం విషయంలో అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల ఆయుధాల సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా ఆయుధ నిల్వలు ఆందోళనకరంగా తగ్గడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని స్పష్టం చేసింది.ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, గత బైడెన్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ భద్రతను ఏ మాత్రం పట్టించుకోకుండా విపరీతంగా ఆయుధాలను ఉక్రెయిన్‌కు తరలించడం వల్లే అమెరికా ఆయుధాగారాలు ఖాళీ అయ్యాయని ఆయన ఆరోపించారు. ముందుగా దేశ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే కీవ్‌కు పంపాల్సిన ఆయుధ సామగ్రిపై కోత విధించినట్లు పేర్కొన్నారు.

ఇటీవల పెంటగాన్ అధికారులు దేశంలోని ఆయుధ నిల్వలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉక్రెయిన్‌కు హామీ ఇచ్చిన కొన్ని ఆయుధాలు దేశీయ అవసరాలకు కూడా సరిపోయే స్థాయిలో లేవని గుర్తించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న ఆయా ఆయుధాల షిప్‌మెంట్లను నిలిపివేయాలని నిర్ణయించారు. అయితే, నిలిపివేసిన ఆయుధాలు వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు అమెరికా సుమారు 66 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని కీవ్‌కు అందించింది. గత బైడెన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయుధ, ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించిన విషయం విదితమే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు