Homeఅంతర్జాతీయంటారిఫ్‌ల కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ..

టారిఫ్‌ల కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ..

- Advertisement -

ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.అమెరికా వాణిజ్య భాగస్వాములపై విధించిన టారిఫ్‌లు అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమైన పన్నులు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 9 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయగా, 6-3 తేడాతో ఈ తీర్పు వెలువడింది. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ఆధారంగా పెద్ద ఎత్తున దిగుమతులపై సుంకాలు విధించడం సమంజసం కాదని కోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ అనుమతి లేకుండా అధ్యక్షుడు స్వయంగా పన్నులు విధించలేరని తేల్చిచెప్పింది. వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం అమెరికా కాంగ్రెస్‌కే చెందినదని కోర్టు అభిప్రాయపడింది.

అంతర్జాతీయ స్థాయిలో నీల్ కత్యాల్ పేరు చర్చనీయాంశం
ఈ కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా వాదించిన భారత సంతతి ప్రముఖ న్యాయవాది నీల్ కత్యాల్ పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. 1977లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించి టారిఫ్‌లు విధించడం రాజ్యాంగ విరుద్ధమని కత్యాల్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. అధ్యక్షుడు తన అధికారాలను ఇష్టారీతిగా వినియోగించరాదని ఆయన వాదించారు. కోర్టు కూడా ఈ వాదనలకు మద్దతు తెలిపింది.

నీల్ కత్యాల్ ఎవరు?
భారత వలస కుటుంబానికి చెందిన నీల్ కత్యాల్ అమెరికాలో జన్మించారు. చికాగోలో జన్మించిన ఆయన తండ్రి ఇంజనీర్‌, తల్లి వైద్యురాలు—ఇద్దరూ భారత్‌ నుంచి అమెరికాకు వలస వెళ్లినవారే.
కత్యాల్ డార్ట్మౌత్ కళాశాల, యేల్ లా స్కూల్ నుంచి పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం మిల్‌బ్యాంక్ ఎల్ఎల్పీ సంస్థలో భాగస్వామిగా, అలాగే జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
బరాక్ ఒబామా హయాంలో అమెరికా యాక్టింగ్ సొలిసిటర్ జనరల్‌గా సేవలందించారు.

అమెరికా సుప్రీంకోర్టులో 50కిపైగా కేసులు వాదించిన అనుభవం కత్యాల్‌కు ఉంది. 2017లో ట్రంప్ అమలు చేసిన ట్రావెల్ బ్యాన్‌ను కూడా ఆయన సవాల్ చేశారు.అమెరికా న్యాయశాఖ అందించే అత్యున్నత పౌర పురస్కారం ఎడ్మండ్ రాండాల్ఫ్ అవార్డ్ఁను ఆయన అందుకున్నారు.
2024, 2025 సంవత్సరాల్లో ఫోర్బ్స్ ప్రకటించిన అమెరికా టాప్-200 న్యాయవాదుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.అమెరికాను కుదిపేసిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో ప్రత్యేక ప్రజా అభియోజకుడిగా పనిచేశారు. అలాగే 1965 ఓటింగ్ హక్కుల చట్టం రాజ్యాంగబద్ధతను కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు