Homeఆంధ్రప్రదేశ్ఎన్నికలలో కూటమి టీవీ రామారావు

ఎన్నికలలో కూటమి టీవీ రామారావు

- Advertisement -

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వానిదే ఘనవిజయం.

 మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గం ఇంచార్జ్ టీవీ రామారావు.

విశాలాంధ్ర – కొవ్వూరు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి పార్టీ ఘనవిజయం సాధిస్తుందని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ టీవీ రామారావు అన్నారు. ఆయన విశాలాంధ్రప్రతినిధితో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీలు జడ్పిటిసిల ఎన్నికల కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులతో మాట్లాడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఒక ఎంపీపీ స్థానాన్ని, జడ్పిటిసి స్థానాన్ని తమ పార్టీ అడుగుతుందని పేర్కొన్నారు. తమ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి పంచాయతి రాజ్ శేఖర్ ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి ఆయా పంచాయతీలకు నేరుగా నిధులను మంజూరు చేశారన్నారు. గత ప్రభుత్వం ఈ నిధులను దారిమళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్నారు. దీంతో ఆయా గ్రామాల్లో పరిపాలన పడకేస్తుందని ధ్వజమెత్తారు.  అదేవిధంగా స్వర్ణ పంచాయతీ యాప్ ను తీసుకొచ్చి పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి తావు లేకుండా పారదర్శకత తెచ్చారన్నారు. రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ ను పూర్తి ప్రక్షాళన జరుగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆర్థిక సంఘం నిధుల ద్వారా పంచాయతీలు బలోపేతమే కాకుండా గాంధీ మహాత్ముడు చెప్పినట్లు పల్లె అభివృద్ధి వేగవంతంగా జరిగి ప్రజలు తమకు అవసరమైన మౌలిక సదుపాయాలను పొందుతారన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలను సైతం బలోపేతం చేయడానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక అటవీ శాఖ విషయానికి వస్తే ఎర్రచందనం దొంగలను జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం వదిలే ప్రశ్న లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించి ఆ సభలలో వచ్చిన సమస్యలను ఇప్పటికే పరిష్కరించాలని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లు రాబోయే పది సంవత్సరాలలో కూడా అధికారంలో ఉండటం టీ.వి.రామారావు పేర్కొన్నారు. కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా తాను ముందు ఉంటారని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు