ఘన నివాళులు అర్పించిన పల్లె కుటుంబ సభ్యులు
భారీగా తరలివచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు
పెద్ద ఎత్తున రక్తదానం, అన్నదానం ,వస్త్ర దానం సేవా కార్యక్రమాలు
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: పేదల పెన్నిధి, నిరాశ్రయులకు అండగా నిలుస్తూ.. ప్రజల హృదయాలు, విద్యార్థుల భవితకు బాటలు వేసిన మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి కీశే పల్లె ఉమా 7వ వర్ధంతి అత్యంత వైభవంగా నిర్వహించారు. రాప్తాడు మండలం ప్రసన్నాయన పల్లి సమీపంలోని పల్లె వ్యవసాయ క్షేత్రంలో పల్లె ఉమ ఘాట్ వద్ద మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ,పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాలల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి కుటుంబ సభ్యులు వియాన్ , వన్ష్యా , మాజీ మంత్రి పల్లె వియ్యంకులు కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి ,ఆయన సతీమణి సౌభాగ్య రాణి, యాజమాన్యం ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, మిత్రులు హాజరై ఘనంగా జన జనసంద్రంలో నివాళులర్పించారు. పల్లె ఉమా వర్ధంతి సందర్భంగా అనంతపురం,సత్యసాయి ఉమ్మడి జిల్లాల నుంచి ప్రముఖులు, ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు ,అమిలినేని సురేంద్రబాబు,ఎంపీ పార్థసారథి, సత్యసాయి టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజనప్ప,మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, నగర మాజీ మేయర్ స్వరూప డిప్యూటీ మేయర్ గంపన్న ,ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ,డిసిఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, జిల్లా గ్రంధాలయ సంస్థల మాజీ చైర్మన్ గౌస్ మొద్దీన్,టీడీపీ క్రిస్టియన్ జిల్లా అధ్యక్షులు స్వామి దాస్ , సింగల్ విండో అధ్యక్షులు సావినీటి సంఘం అధ్యక్షులు, సిపిఐ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, పుట్టపర్తి నియోజవర్గ టీడీపీ ,బీజేపీ ,జన సేన,కాంగ్రెస్ ,వైసీపీ , బీఎస్పీ పార్టీల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఆకట్టుకున్న పల్లె ఉమా చిత్ర ప్రదర్శన
పల్లె ఉమా వర్ధంతి సందర్భంగా పల్లె వ్యవసాయ క్షేత్రంలో పల్లె కుటుంబం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పల్లె ఉమా జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ సిబ్బంది ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఏర్పాట్లు చేశారు. అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఈ ఫోటో ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది.
భారీ ఎత్తున రక్తదాన శిబిరం
పల్లె ఉమా వర్ధంతి సందర్భంగా పల్లె వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టిడిపి శ్రేణులు పల్లె అభిమానులు సప్తగిరి ,బాలాజీ ,పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల విద్యా సంస్థల నుంచి విద్యార్థులు ,సిబ్బంది , , మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది మోపురి సురేష్ మంజునాథ్ రెడ్డి హర్షద్ భాష,త్రిలోక్ , టీడీపీ నాయకులు రమేష్ , బుట్టి నాగభూషణం, మహేశ్వర్ రెడ్డి,ప్రసాద్ రెడ్డి, సురేష్ తో పాటు పలువురు అభిమానులు రక్తదానం చేశారు.
సిబ్బందికి కార్మికులకు పెద్ద ఎత్తున వస్త్ర దానం
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమా 7వ వర్ధంతి సందర్భంగా పల్లె ఉమా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీబాలాజీ విద్యాసంస్థలు, శ్రీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ సిబ్బందికి , పివి కేకే ఇంజనీరింగ్ కళాశాలల సిబ్బందికి కళాశాలల నిర్మాణ కార్మికులకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కళాశాలల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి చేతుల మీదుగా వస్త్ర దానం చేశారు.
పెద్ద ఎత్తున అన్నదానం
పల్లె ఉమా ఏడవ వర్ధంతి సందర్భంగా అనంతపురం సత్యసాయి ఉమ్మడి జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జగదీష్ కాటమయ్య ,వేమయ్య యాదవ్ జాఫర్ , కేశవరెడ్డి శ్రీరాములు సిపిఎం పెద్దిరెడ్డి, రాభూపాల్ ,నాగేంద్ర ,అనంతపురం నగర ప్రముఖ వైద్యులు సుధీంద్ర, రామ్మోహన్ , రాంప్రసాద్ ,ఏపీపిఎస్ఎస్సి మాజీ చైర్మన్ వెంకట్రాం రెడ్డి, వైస్ చాన్సలర్లు హుసేన్ రెడ్డి, జేఎన్టీయూ రిజిస్టర్ కృష్ణయ్య, ఎస్ కే ,జేఎన్టీయూ ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్ సుబ్బారావు, మన్మధేశ్వర్ రెడ్డి, బండి రమేష్ బాబు, ముని కృష్ణారెడ్డి, రాఘవేంద్ర, ప్రకాష్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.


