Homeఅంతర్జాతీయంబలోచిస్థాన్ లో ఆరని మంటలు

బలోచిస్థాన్ లో ఆరని మంటలు

- Advertisement -

పాక్ భద్రతా సిబ్బందిపై బీఎల్‌ఏ ఆత్మాహుతి దాడి…30 మంది మృతి
క్వెట్టా:
బలోచిస్థాన్ లో అల్లర్లు చల్లారడం లేదు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) సైనిక స్థావరాలు, భద్రతా స్థావరాలపై దాడులు జరుపుతూ పాకిస్థాన్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా బలోచిస్థాన్లోని జివానీలో గల పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిపినట్లు ప్రకటించింది. ఈ ఘటనలో 30 మంది పాక్ జవాన్లు మరణించినట్లు పేర్కొంది. తమ యోధులు శిబిరంలోకి చొరబడి, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని బీఎల్‌ఏ ప్రతినిధి మీడియాకు తెలిపారు. అయితే ఈ దాడి, మృతులకు సంబంధించి పాకిస్థాన్ నుంచి అధికారిక ప్రకటన ఏదీ ఇంత వరకు వెలువడ లేదు.
నైరుతి పాకిస్థాన్ లోని అతిపెద్ద ప్రావిన్స్‌ బలోచిస్థాన్. ఇక్కడ అపార సహజవాయువులు, బొగ్గు, బంగారం, రాగి నిల్వలు అపారంగా ఉన్నాయి. తమ ప్రాంతంలోని సహజవనరులపై తమకే నియంత్రణాధికారం ఉండాలని బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని బీఎల్‌ఏ వంటి వేర్పాటువాద గ్రూపులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వానికి, చైనా పెట్టుబడులకు వ్యతిరేకంగా బీఎల్‌ఏ స్వతంత్ర దేశం కోసం సాయుధ పోరాటం సాగిస్తున్నాయి. దీనికి స్థానిక ప్రజల మద్దతు బారీగానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో తరచూ సైనిక, పారామిలిటరీ, ఇతర ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. దీనిని పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థగా ప్రకటించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు