విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వంశీకృష్ణ నోబుల్ స్కూల్ మెయిన్ బ్రాంచ్ నందు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయుల నడుమ సంబరాలను అంగరంగా వైభవంగా జరుపుకోవడం జరిగిందని పాఠశాల వ్యవస్థాపకులు బీరే గోపాలకృష్ణ, కరెస్పాండెంట్ బీరే వంశీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత గాలిపటాలు ఎగిరివేయడం, బాలికలచే రంగురంగుల ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తర్వాత వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. తదుపరి కరస్పాండెంట్ సంక్రాంతి సంబరాలు ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.


