విశాలాంధ్ర-కొవ్వూరు: కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ గా సిహెచ్ వెంకటేశ్వర్లు నియమితులైనట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన నాగేంద్ర కుమార్ పై కొన్ని ఆరోపణలు రాగా మున్సిపల్ ఉన్నతాధికారులు ఆయనను పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఏఈ గ్రంధి సందీప్ కు కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే కొత్త కమిషనర్గా నియమితులైన సిహెచ్ వెంకటేశ్వర్లు తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఆర్వోగా పనిచేసినట్లు తెలుస్తోంది. అయితే ఈయన పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుండగా మున్సిపల్ ఉన్నతాధికారులు కొవ్వూరు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. రాబోయే పుష్కరాలను ఏ మేరకు బాధ్యతలు నిర్వహిస్తారో పట్టణ ప్రజలు వేచి చూస్తున్నారు.
కొవ్వూరు కొత్త కమిషనర్ గా వెంకటేశ్వర్లు ?
- Advertisement -
RELATED ARTICLES


