విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): మండలంలోని అరమ పంచాయతీ కేంద్రంలో శుక్రవారం స్థానిక పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మూగజీవులైన పశువులు, 237 మేకలు, గొర్రెలకు 79కి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారిని రాజశ్రీ మాట్లాడుతూ గ్రామాల్లో మూగజీవులకు ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందిన తక్షణమే స్థానిక పశువైద్య సిబ్బందికి సమాచారం అందిస్తే వెంటనే వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని వీటిని గిరి రైతులు దృష్టిలో ఉంచుకొని మూగజీవులకు ఎటువంటి వ్యాధులు వచ్చిన తక్షణమే తమకు సమాచారం అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కే ముల,ఎల్ ఎస్ ఏలు దివ్య, ప్రసన్న, సచివాలయం విహెచ్ఎలు సింహాచలం, అప్పారావు, లక్ష్మి, బాలచందర్, ఆనోకుబాబు, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అరమలో పశువైద్య శిబిరం
- Advertisement -
RELATED ARTICLES


