Homeజిల్లాలుఅనంతపురంఓటు వజ్రాయుధం

ఓటు వజ్రాయుధం

- Advertisement -

విశాలాంధ్ర -జేఎన్టీయూ ఏ : సుపరి పాలన, ప్రజా సంక్షేమ, స్వేచ్ఛ సమాజ నిర్మాణానికి ఓటు వజ్రాయుధమని అనంతపురం రూరల్ తహశీల్దార్ కే. మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఓటు హక్కు పై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొంది ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలని సూచించారు. అనంతరం ఓటు హక్కు దరఖాస్తు విధానం, నిబంధనలపై వివరించారు. చైర్మన్ అనంత రాముడు మాట్లాడుతూ.. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ప్రతి పౌరుడు ఓటు హక్కును పొంది.. ప్రజా విలువలను పెంపొందించాలన్నారు.ఈ కార్యక్రమంలోనైపుణ్యాభివృద్ది సంచాలకులు డా. ఎం.సురేంద్ర నాయుడు, వీఆర్వో ఇటికలపల్లి వీఆర్వో రవివర్మ ,శివ శంకర్ ,కళాశాల ప్రిన్సిపాల్ డా. కుటాల శ్రీనివాసులు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు