- Advertisement -
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : కొలతల ప్రకారమే వేతనాలుఉంటాయని ఏపీఓ దయాసాగర్ అన్నారు. శనివారం మండలంలోని కళ వల్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు.మస్టర్లను తనిఖీ చేసి చదివి వినిపించారు. ఈ సందర్బంగా వేసవికాలంలో కూలీలకు అందుతున్న వసతులను పరిశీలించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని పీల్డ్ అసిస్టెంట్ మోదేపల్లి శ్రీనివాసులు ని ఆదేశించారు. ఈకార్యక్రమంలో పీల్డ్ అసిస్టెంట్ మోదేపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు.


