Homeతెలంగాణచారిత్రక కట్టడాలను తీర్చిదిద్దుతాం

చారిత్రక కట్టడాలను తీర్చిదిద్దుతాం

- Advertisement -

మంత్రి జూపల్లి
విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణలో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ప్రపంచ పర్యాట కులకు పరిచయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కష్ణారావు అన్నారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా వాటిని అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొ న్నారు. కుతుబ్ షాహీ టూంబ్స్‌లోని ఇంటర్‌ర్పి టేషన్ కేంద్రంలో జరుగుతున్న పనులను బుధవారం మంత్రి పరిశీలించారు. వక్ఫ్ ట్రిబ్యునల్‌లో కేసు పెండింగ్ గురించి అధికా రులతో చర్చించారు. కేసు పూర్వాపరాలను వారు వివరించారు. ట్రిబ్యునల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను మినహాయించి, మిగిలిన పనులను వారంలోగా ప్రారంభించి, వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కుతుబ్ షాహి టూంబ్స్ నుంచి గోల్కొండ కోట వరకు 1.3 కిలోమీటర్ల రోప్ వే నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయని ఆరా తీశారు. క్లియరెన్స్ స్టేజిలో ఉన్నాయని, ఆయా శాఖల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే డీపీఆర్ సిద్ధం చేస్తామని అధికారులు చెప్పారు. అనంతరం కటోరా హౌస్‌ను సందర్శించారు. పురావస్తు శాఖ, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ, కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని సమన్వయం చేసుకుని డీపీఆర్ సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. కటోరా హౌస్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచిం చారు. కటోరా హౌస్ పరిసర ప్రాంతాల్లో వ్యర్థా లను వెనువెంటనే తొలగించాలని జీహెచఎంసీ అధికారులు ఆదేశించారు. అనంతరం గోల్కొండ కోట సమీపంలోని బస్ స్టాప్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో లాడ్ బజార్ తరహాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ ప్రతిపాదనలను నేషనల్ మాన్యుమెంట్ మిషన్ అథారిటీకి పంపి అనుమ తులు పొందాలని సూచించారు. అక్కడి నుంచి ఖజానా బిల్డింగ్ మ్యూజియంకు చేరుకున్నారు. ఎంతో చారిత్రాత్మక విలువైన కళాఖండాలు ఉన్న ఈ మ్యూజియంను పర్యాటకంగా అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రదేశంలో చేనేత వస్త్రాల (ఖాదీ) ప్రదర్శన ను ఏర్పాటు చేయాలని పురావస్తు , టీజీటీడీసీ, క్యూఎస్డీఏ అధికారులను ఆదేశించారు. కేబీ మ్యూజియం వెనక భాగంలో ఉన్న ఆక్రమణలను పోలీస్ శాఖ సహకారంతో వారం రోజుల్లో తొలగించాలని అన్నారు. టీజీటీడీసీ ఎండీ గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు, ఇతర శాలల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు