Homeజిల్లాలుఅనంతపురంనార్పల ఎంజేపీ గురుకుల పాఠశాల విచారణ నివేదిక జాడేది..? : ఎస్‌ఎఫ్‌ఐ...

నార్పల ఎంజేపీ గురుకుల పాఠశాల విచారణ నివేదిక జాడేది..? : ఎస్‌ఎఫ్‌ఐ…

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందాల్సిన సరుకులు పక్కదారి పట్టిన ఘటనపై నిర్వహించిన విచారణ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాచేపల్లి డిమాండ్ చేశారు.
సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ, పది రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన సరుకుల అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినప్పటికీ ఇప్పటివరకు నివేదికను ప్రజల ముందుకు తీసుకురాలేదని విమర్శించారు.
విచారణ సందర్భంగా మీడియా ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులను అనుమతించకుండా పూర్తిగా గోప్యంగా నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. విద్యార్థులకు అందాల్సిన నిత్యావసర సరుకులను పక్కదారి పట్టించిన వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.విద్యార్థుల హక్కులకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విచారణ నివేదికను వెంటనే బహిర్గతం చేసి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ తరఫున డిమాండ్ చేశారు. దీంతోనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు