ప్రపంచంలో అతిపెద్ద జనాభా దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భారత్…
ఇది కేవలం బాధాకరం కాదు…ఇది నిజంగా సిగ్గుచేటు విషయం!
సిపిఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ
United States, Israel కలిసి Iran పై దాడులు చేస్తుంటే… అమాయక పిల్లలు, నిరపరాధ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే… భారత్ కేవలం చూస్తూ ఉండాలా? ఇదేనా మన విదేశాంగ విధానం?ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే… Pakistan కూడా మధ్యవర్తిత్వానికి ముందుకు వస్తోంది! భారత్ చేయాల్సిన పని… పాకిస్తాన్ చేస్తుంటే… మనం ఎందుకు మౌనం పాటిస్తున్నాం?మన ప్రధాని Narendra Modi గారు ప్రపంచం మొత్తం తిరుగుతారు… కానీ ఇలాంటి క్లిష్ట సమయంలో ఒక అడుగు ముందుకు వేసి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయకపోతే ఆ పర్యటనల అర్థమేంటి?గతంలో నేను Russia, Germany, Vietnam, Cuba, China, Italy దేశాలకు వెళితే… సాధారణ ప్రజలు భారతీయులను ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ Indira Gandhiను గుర్తు చేసుకునేవారు. అదే భారత్ గౌరవం… అదే భారత్ ప్రభావం!ఈరోజు ఆ స్థాయి ఎందుకు కనిపించడం లేదు? ఇది స్పష్టంగా నాయకత్వ వైఫల్యం! ఒక గొప్ప అవకాశాన్ని మనం కోల్పోయాం.


