Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్టీడీపీ జిల్లా రథసారధిపై వీడని ఉఠ్కంటతిక్కారెడ్డినే కొనసాగిస్తారా కొత్తవారికి అవకాశం ఇస్తారా ?

టీడీపీ జిల్లా రథసారధిపై వీడని ఉఠ్కంటతిక్కారెడ్డినే కొనసాగిస్తారా కొత్తవారికి అవకాశం ఇస్తారా ?

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : టీడీపీ జిల్లా అద్యక్షస్థానంపై అదిష్టానం ఇంత వరకు నిర్ణయం తీసుకోకపోవడంతో నూతన జిల్లా అద్యక్షుడు ఎవరు అన్నదానిపై తీవ్ర చర్చనడుస్తుంది. 2024 ఎన్నికల ముందు ప్రస్తుతం అద్యక్షునిగా ఉన్న తిక్కారెడ్డిని అద్యక్షునిగా టీడీపీ అదిష్టానం నియమించింది. తిక్కారెడ్డి మంత్రాలయం నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్నారు. 2019 ఎన్నికలలో మంత్రాలయం నియోజకవర్గం నుండి బరిలో నిలిచి ఓటమి పాలైనారు. అయినా నియోజకవర్గంలో ఆయన విసృతంగా పర్యటనలుచేస్తూ ప్రజలకు చేరువగా నిలిచారు. 2024 ఎన్నికల ముందు రాజకీయ సమీకరణలో భాగంగా అదిష్టానం మంత్రాలయం వాల్మీకి సామాజిక వర్గంకు కేటాయించింది. అప్పటి వరకు ఇన్‌చార్జిగా ఉన్న తిక్కారెడ్డిని టీడీపీ కర్నూలు పార్లమెంట్‌అద్యక్షునిగా నియమించింది. ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ఘనవిజయం సాధించింది. కర్నూలు పార్లమెంట్‌తోపాటు కూటమి అభ్యర్థులు ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపటి ్టంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్‌ చైర్మెన్‌ పదవి వస్తుందని తిక్కారెడ్డి ఆశించారు. కాని అదిష్టానం తిక్కారెడ్డికి ప్రస్తుతం ఎలాంటి పదవీ ఇవ్వలేదు . రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుల మార్పులో భాగంగా కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షున్ని కూడా మార్చాలని అదిష్టానం నిర్ణయించింది. ఇందుకు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, హిందూపురం ఎంపీ పార్థసారధి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబులతో త్రిసభ్య కమిటి నియమించింది. వారు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లా అద్యక్ష బరిలో ప్రస్తుత అద్యక్షులు తిక్కారెడ్డి, కర్నూలు టీడీపీ నగర అద్యక్షులు నాగరాజుయాదవ్‌, టీడీపీ లీగల్‌ సెల్‌ అద్యక్షులు కేఈ జగదీష్‌గౌడ్‌ రేసులో ఉన్నారు. అదిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతుందో , ఎవరిని నియమిస్తుందో నని కార్యకర్తలు ఉఠ్కంట ఎదురు చూస్తున్నారు.అద్యక్ష సీటుకోసం ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 2026 జనవరి నుండి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటం వలన ఆ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధ్యక్షస్థానం ఎంపిక జరుగుతుందంటున్నారు. ఇప్పటికే టీడీపీ జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబునాయుడు, ప్రదాన కార్యదర్శి నారాలోకేష్‌లు జిల్లాపై దృష్టిసారించినట్లు తెలుస్తుంది. త్వరలోనే నూతన అద్యక్షున్ని ప్రకటిస్తారని ఆపార్టీ నేతలు తెలియచేస్తున్నారు. అయితే ప్రస్తుతం అద్యక్షునిగా ఉన్న తిక్కారెడ్డిని ఎవరు వ్యతిరేఖించకపోవడం విశేషం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు