Homeఆంధ్రప్రదేశ్22న ప్రపంచ మామిడి దినోత్సవం.

22న ప్రపంచ మామిడి దినోత్సవం.

- Advertisement -

మామిడి బోర్డు, గిట్టుబాటు ధరపై చర్చ.

వందలాదిగా పాల్గొనండి

జూలై 22న తిరుపతిలో జరిగే ప్రపంచ మామిడి దినోత్సవానికి పెద్ద సంఖ్యలో రైతుల హాజరై గిట్టుబాటు ధర సాధన కోసం సమాయత్తం కావాలని ఏపీ రైతు సంఘం నేతలు డాక్టర్ టి. జనార్ధన్, జి. మునిరత్నం లు పేర్కొన్నారు. శుక్రవారం పాకాల భారతంమిట్ట వద్ద మామిడి దినోత్సవం కరపత్రాలను రైతు సంఘం నాయకులు బెల్లంకొండ శ్రీనివాసులు, వెంకటరత్నం, శివారెడ్డి తో కలిపి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మామిడి రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తుత్తి ప్రకటనలు, హామీలు తప్ప వాస్తవంగా గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రు17. 47 పెసలు కిలోకి ప్రకటించినా రైతులకు రాంపుల వద్ద మూడు రూపాయలు,ఫ్యాక్టరీల వద్ద ఐదు రూపాయలు మాత్రమే గిట్టుబాటు అయిందని పేర్కొన్నారు.
రైతులకు రవాణా, కోత కూలీలు కూడా గిట్టుబాటు కాలేదని వాపోయారు.గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మామిడి రైతులకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని అన్నారు.
సీజన్ ముగిసే సమయం లో కేంద్ర ప్రభుత్వం వేసిన “ఐకార్” కమిటి రైతును ఆదుకునే లా నివేదికలిస్తే ఫలితమని, లేకున్న కంటి తుడుపు చర్యగా వుంటుందని తెలిపారు. సతవరం మామిడి బోర్డ్ ఏర్పాటు చేసి రైతుల భాగస్వామ్యంతో మామిడి ధరలు నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు.
ఈనెల 22న తిరుపతిలో జరిగే మామిడి ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా రైతు నాయకులు, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొని మరిన్ని సూచనలు, భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించ నున్నట్లు తెలిపారు.ఈ సభకు రైతులు వందలాది గా పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాకాల, కొత్తకోట రైతు నాయకులు చెంగల్ రెడ్డి, ప్రకాష్,శంకర్ నాగరాజు, రాజేంద్ర,షబ్బీర్,మధు లోకనాథ్ సింగ్,హేమానంద తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు