విశాలాంధ్ర ధర్మవరం;; యోగివేమన అందరికీ ఆదర్శప్రాయుడని హెడ్మాస్టర్ నాగప్ప తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎల్సీకే పురంలో పురపాలక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వేమన పద్యాల పై విద్యార్థులకు పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వేమన పద్యాల పై ప్రతిభ ఘనపరిచి గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మెమొంటోలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. తొలుత హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగివేమన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. యోగి వేమన తన పద్యాల ద్వారా సమానత్వం, సత్యం, నైతికత, మానవ విలువలు వంటి అంశాలను ప్రజలలో నాటిన మహనీయుడని అన్నారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా సమాజ సంస్కరణకు తన సాహిత్యాన్ని ఆయుధంగా మలిచిన యోగి వేమన బోధనలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని తెలిపారు. నేటికీ యోగివేమన పద్యాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యోగి వేమన అందరికీ ఆదర్శప్రాయుడు..హెడ్మాస్టర్ నాగప్ప
- Advertisement -
RELATED ARTICLES


