విశాలాంధ్ర బొమ్మనహాళ్,.. మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలో గర్తుతెలియని వ్యక్తులు దుండగుల చర్యకు పాల్పడి రైతుల పొలాల్లో నిల్వ ఉంచిన వరిగడ్డి కుప్పలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో దివానమ్మ, ఈశ్వరమ్మలకు చెందిన సుమారు 7 ఎకరాల పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైంది. బాధితులు దివానమ్మ 3.50 ఎకరాలు, ఈశ్వరమ్మలకు 3.50 ఎకరాలలో వరి పంట సాగు చేశారు. పంట కోత ఇటివలే పూర్తి చేసిన నేపథ్యంలో వరిగడ్డిని ఇతరలకు విక్రయించాలని గుప్పలు చేసి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి నిప్పు పెట్టినట్లు బాధితులు తెలిపారు. మంగళవారం ఉదయం పోలంలోకి వెళ్లి చూడగా పొలంలోని పశుగ్రాసం మొత్తం బూడిదయ్యింది. ఈఘటనతో తమ జీవనాధారం దెబ్బతిందని బాధితులు దివానమ్మ, ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనపై పోలీసులకు సమాచారం అందించామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను బాధితులు కోరారు


