Homeఅంతర్జాతీయంఅమెరికాలో బోయింగ్‌ ఉద్యోగుల సమ్మె

అమెరికాలో బోయింగ్‌ ఉద్యోగుల సమ్మె

- Advertisement -

న్యాయమైన కార్మిక ఒప్పందానికి డిమాండ్‌` పాల్గొన్న 3వేల మంది

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని మిస్సోరీ, ఇల్లినాయిస్‌ రాష్ట్రాల్లో 3,200 మంది బోయింగ్‌ యూనియన్‌ వర్కర్లు సమ్మెబాట పట్టారు. న్యాయమైన ఒప్పందం కోసం కంపెనీతో చర్చలు ఫలించకపోవడంతో ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి సోమవారం భారీ స్థాయిలో నిరసన తెలిపారు. బోయింగ్‌తో నాలుగేళ్ల లేబర్‌ ఒప్పందం సవరణను తిరస్కరిస్తూ 837 మంది ఓటేసినట్లు ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మెషీనిస్ట్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ వర్కర్స్‌ (ఐఏఎం) సభ్యులు ప్రకటించిన తర్వాత సమ్మెకు పిలుపునిచ్చారు. ‘కార్మికుల ఐక్యశక్తి బోయింగ్‌కు తెలిజేస్తాం’ అని ఐఏఎం అంతర్జాతీయ అధ్యక్షుడు బ్రెయిన్‌ బ్రయంట్‌ ఒక ప్రకటన చేశారు. తమ కుటుంబాలకు భద్రత కల్పిస్తూ, తమ విలువైన అనుభవానికి గుర్తింపు లభించే విధంగా ఒప్పందాన్ని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారని, ఇది న్యాయమైనదేనని ఐఏఎం మిడ్‌వెస్ట్‌ టెరిటరీ జనరల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శామ్‌ సిసినెల్లీ వెల్లడిరచారు. ఐకమత్వమే మన బలం అని నినదించారు. వ్యతిరేక ఓటు ద్వారా కార్మికుల శక్తి ఏమిటో యాజమాన్యానికి తెలియజేస్తామని, కార్పొరేట్‌ అత్యాసను తిరస్కరిస్తామని, మాకు, మా కుటుంబాలకు మెరుగైన భవిష్యత్‌ కోసం పోరాడతామని ఐఏఎం రెసిడెంట్‌ జనరల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జోడీ బెన్నెట్‌ పిలుపునిచ్చారు. ఆరు లక్షల మందికిపైగా ఏరోస్పేస్‌, రక్షణ, ఎయిర్‌లైన్స్‌, రైల్‌రోడ్‌, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొటివ్‌ తదితర రంగాల కార్మికులకు ప్రాతినిధ్యం వహించే ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా ఐఏఎం ఉంది. తాము ప్రతిపాదించిన కార్మిక ఒప్పందాన్ని వర్కర్లు తిరస్కరించడంపై బోయింగ్‌ యాజమాన్యం అసంతృప్తి వ్యక్తంచేసింది. 40శాతం సగటు వేతన వృద్ధిని వారు వద్దంటున్నారని పేర్కొంది. సమ్మెకు సిద్ధమని, ఆందోళనలకు వెళ్లని సిబ్బంది ద్వారా తమ వినియోగదారులకు సేవలు అందించేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు