బీజింగ్: అవినీతిని ఎంత మాత్రం సహించేది లేదని తమ అధికారులకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతంలోనే స్పష్టం చేశారు. అవినీతిని కట్టడి చేసేందుకు కఠిన చర్యల క్రమంలో ఏకకాలంలో 11 మంది కీలక అధికారుల స్థానాలను కొత్తవారితో భర్తీ చేశారు. 2012లో అధికారంలో వచ్చినప్పటి నుంచి వేలాది మంది అవినీతి అధికారులు, రాయబారులు, సైన్యాధికారులపై జిన్ంగ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తాజాగా 300 మందికిపైగా సభ్యులతో బీజింగ్‌లో నిర్వహించిన జనాంతిక సమావేశం ‘ఫోర్త్ ప్లీనమ్’లో పంచవర్ష ఆర్థిక ప్రణాళికపై చర్చించారు. అనంతరం చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) ఒక ప్రకటన చేసింది. సీనియర్ జనరల్ జాంగ్ షెంగ్మిన్ (67)కు శక్తిమంతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) వైస్ చైర్మన్ (రెండో ర్యాంకు)గా పదోన్నతి కల్పించింది. అయితే అవినీతి ఆరోపణలతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మి జనరల్స్ ఎనిమిది మందితో పాటు సీఎంసీ వైస్ చైర్మన్ హీ వెడాంగ్ను పార్టీ బహిష్కరించింది. హీ వెడాంగ్ స్థానంలో జాంగ్‌ను నియమించింది. కాగా, 2017లో ఏడవ ప్లీనం తర్వాత ఒకేసారి ఇంత మంది స్థానాలను భర్తీ చేయడం జరగలేదు.
అవినీతిపై జిన్‌పింగ్ ఉక్కుపాదం
- Advertisement -
RELATED ARTICLES


