Homeసినిమాఆకట్టుకున్న ‘సరస్వతి’ ట్రైలర్

ఆకట్టుకున్న ‘సరస్వతి’ ట్రైలర్

- Advertisement -

నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సరస్వతి’ ట్రైలర్ విడుదలై… విశేష స్పందన పొందుతోంది. తన కూతురు స్కూల్ నుంచి కనిపించకుండా పోవడంతో ఒక తల్లి (వరలక్ష్మి) చేసే పోరాటమే కథాంశం. వ్యవస్థపై ఆమె ఎలా తిరగబడింది అనేదే అసలు కథ. నటీనటుల విషయానికి వస్తే… ప్రకాష్ రాజ్ అడ్వకేట్ రామానుజంగా నటిస్తుండగా, ప్రియమణి, కిషోర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ‘ప్రతి ఆడదీ సరస్వతి కాదు… అవసరమైతే కాళికాదేవిగా మారుతుంది’ అనే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వరలక్ష్మి సోదరి పూజాతో కలిసి ‘దోశ డైరీస’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు