Homeక్రీడలుఇంగ్లాండ్తో సెమీస్ పోరుకు టీమిండియా సిద్ధం

ఇంగ్లాండ్తో సెమీస్ పోరుకు టీమిండియా సిద్ధం

- Advertisement -

. టీ20 ప్రపంచకప్లో వరుసగా మూడోసారి సెమీస్ లో తలపడనున్న ఇరు జట్లు
. నేడు వాంఖడే వేదికగా జరగనున్న మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి

ముంబై : టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలైన పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, రెండుసార్లు విజేత అయిన ఇంగ్లాండ్ తలపడనుంది. క్రికెట్ని ఈ చిరకాల ప్రత్యర్థులు టీ20 ప్రపంచకప్సె మీఫైనల్లో వరుసగా మూడోసారి అమీతుమీ తేల్చుకోనుండటంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2022, 2024 ప్రపంచకప్ లో భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్లో గెలిచిన జట్టే చివరికి ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అదే సెంటిమెంట్ పునరావృతం అవుతుందా? అనిఅభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన సెమీఫైనల్ భారత అభిమానులకు ఒక పీడకలగా మిగిలిపోయింది. ఆ మ్యాచ్లోతొలుత బ్యాటింగ్ చేసిన భారత్, విరాట్ కోహ్లి (50), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 63) రాణించడంతో 168 పరుగులు చేసింది. అయితే, ఛేదనలో ఇంగ్లండ్ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్ నష్టపోకుండా కేవలం 16 ఓవర్లలోనేలక్ష్యాన్ని ఛేదించారు. ఈ 10 వికెట్ల ఘోర పరాజయం తర్వాత టీ20 ఫార్మాట్లో జట్టు వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మవ్యాఖ్యానించాడు. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం భారత్కు 2024 ప్రపంచకప్లో లభించింది. గయానాలోని క్లిష్టమైన పిచ్పై జరిగిన సెమీస్ లో భారత్అద్భుతంగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 బంతుల్లో 57), సూర్యకుమార్ యాదవ్ (47) రాణించడంతో భారత్ 171 పరుగుల పోరాడే స్కోరు చేసింది.అనంతరం బౌలింగ్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ 103 పరుగులకే కుప్పకూలింది. భారత్ 68 పరుగుల తేడాతోఘన విజయం సాధించి ఫైనలక్కు దూసుకెళ్లడమే కాకుండా ఆ టోర్నీలో చాంపియన్గా నిలిచింది. ఇప్పుడు 1-1తో సమంగా ఉన్న ఈ సెమీఫైనల్ పోరులోమూడోసారి పైచేయి ఎవరిదో తేలనుంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ హ్యాట్రిక్ సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని రెండు జట్లు ఊపుమీదఉన్నాయి.వాంఖడేను నిశ్శబ్దంగా మారుస్తాం: సామ్ కరన్సెమీ ఫైనల్కు ముందు జరిగిన మీడియా సమావేశంలో సామ్ కరన్ మాట్లాడుతూ గురువారం వాంఖడే స్టేడియం చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుందనితాను భావిస్తున్నట్లు నవ్వుతూ చెప్పాడు. “ఒకవేళ స్టేడియంలోని ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉన్నారంటే, మైదానంలో ఇంగ్లాండ్ జట్టు చాలా బాగా రాణిస్తుందని అర్థం”అని వివరించాడు. ముంబై ప్రేక్షకులు ఇచ్చే మద్దతు తమకు తెలుసని, కానీ వారిని సైలెంట్ గా చేయడం ద్వారా భారత్పై ఒత్తిడి పెంచవచ్చని కరన్అభిప్రాయపడ్డాడు. అభిమానుల అరుపులను నియంత్రించగలిగితే తాము మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లేనని ధీమా వ్యక్తం చేశాడు. సామ్ కరన్ చేసిన ఈవ్యాఖ్యలు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలనుగుర్తుకు తెస్తున్నాయి. అప్పట్లో అహ్మదాబాద్ లోని లక్షా ముప్పైరెండు వేల మంది ప్రేక్షకులను నిశ్శబ్దంగా మార్చడం కంటే సంతృప్తినిచ్చే విషయం మరొకటి ఉండదని కమిన్స్ చెప్పాడు. అన్నట్లుగానే ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియాభారతను ఓడించి లక్షలాది మంది భారతీయుల హృదయాలను బద్దలు కొట్టింది. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో సామ్ కరన్ కూడా స్టేడియంను సైలెంట్చేస్తామంటూ వ్యాఖ్యానించడం భారత అభిమానులకు ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. “చాలా మంది యువ క్రికెటర్లు భారత్తో సెమీస్ ఆడాలని కలలుకంటారు. మాకు ఆ అవకాశం రావడం గొప్ప విషయం” అని కరన్ అన్నాడు. స్టేడియం లోపల ఎంత సౌండ్ ఉన్నా దానిని ఒక అద్భుతమైన అనుభవంగాతీసుకుంటామని, కానీ అంతిమంగా మా లక్ష్యం మాత్రం స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చి ఫైనల్కు వెళ్లడమేనని కరన్ స్పష్టం చేశాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు