సర్వేలో స్పష్టం చేసిన అమెరికన్లు
వాషింగ్టన్: పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం వల్ల అమెరికా సైన్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ఇరాన్‌పై దాడులను సొంత పౌరులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదంటూ 54శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ఇప్సాస్-రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. గత కొన్ని వారాలుగా ఇరాన్‌పై యుద్ధం సాగిస్తోన్న అమెరికా… తాజాగా కీలకమైన ీVAర్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. అయితే, ఈ చర్యలను 54శాతం మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ దాడులతో వారి ఆర్థికవ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వారు అభిప్రాయం వ్యక్తంచేశారు. 65శాతం మంది డెమోక్రాట్లు, 56శాతం మంది ఇండిపెండెంట్లు, 40శాతం రిపబ్లికన్లు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య సరైందేనని 24 శాతం మంది సమర్థించినట్లు సర్వే తెలిపింది. మరో 22 శాతం మంది అసలు దీనిపై స్పందించడానికే ఇష్టపడలేదట. ఇక, ట్రంప్ రిపబ్లికన్ పార్టీలోనూ 54శాతం మంది యుద్ధానికి అనుకూలంగా ఉండగా… మిగతా వారు వ్యతిరేకిస్తున్నట్లు సర్వే పేర్కొంది. మొత్తానికి ఈ సర్వేతో రిపబ్లికన్ పార్టీలో చీలికలు ఏర్పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
10వేల మంది అమెరికా దళాల మోహరింపు
ీVAర్మూజ్ జలసంధితో సహా కీలక ప్రాంతీయ జలమార్గాలలోనూ పెద్ద ఎత్తున అమెరికా దళాలు మోహరించినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ పోర్టుల్లో దాదాపు 10వేల మంది సైనికులు, మెరైనర్లు, వైమానిక దళ సిబ్బందిని మోహరించినట్టు సమాచారం. కాగా, గత 24 గంటల్లో హర్మూజ్ జలసంధి గుండా 20కి పైగా వాణిజ్య నౌకలు ప్రయాణించాయని ఇద్దరు అమెరికా అధికారులు చెప్పినట్లు డబ్ల్యూఎస్‌జే వెల్లడించింది. ఇందులో పర్షియన్ గల్ఫ్‌లోకి, బయటకు వెళ్లే సరుకు రవాణా, కంటైనర్, ట్యాంకర్ నౌకలు ఉన్నాయని ఆ అధికారులలో ఒకరు తెలిపారు. ఇరాన్ దాడుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి కొన్ని నౌకలు తమ ట్రాన్స్పాండర్లు లేకుండా ప్రయాణించాయి. యుద్ధ సమయంలో ఇరాన్ దాడులు, సముద్ర మైన్ల ముప్పు కారణంగా చాలా నౌకలు ఆ ఇరుకైన జలమార్గం గుండా ప్రయాణించేందుకు ప్రయత్నించలేదు.
చమురు కొనుగోలుపై సడలింపును పొడిగించం: అమెరికా
ఇరాన్ చమురుపై ఆంక్షల విషయంలో అమెరికా ఆర్థికశాఖ కీలక ప్రకటన చేసింది. చమురును కొనుగోలు చేయడానికి ఇచ్చిన తాత్కాలిక సడలింపును పొడిగించబోమని తెలిపింది. గత నెలలో ఇరాన్ దళాలు ీVAర్మూజ్ జలసంధిని దిగ్బంధించడంతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో నౌకల్లో లోడైన ఇరాన్ చమురును ఇతర దేశాలు కొనుగోలు చేసేందుకు అమెరికా తాత్కాలిక సడలింపు ఇచ్చింది. ఆ గడువు ఈనెల 19న ముగియనుంది.
ఇరాన్‌తో యుద్ధం వద్దు
- Advertisement -
RELATED ARTICLES


