Homeసినిమా‘ఈగో రాజా’గా సాయికుమార్

‘ఈగో రాజా’గా సాయికుమార్

- Advertisement -

హైదరాబాద్: ఆది సాయి కుమార్ హీరోగా ఎస్‌జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సురేష్ నిర్మిస్తున్న ‘ఈగో రాజా’ మూవీని గురు శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను ఉగాది సందర్భంగా వెల్లడించారు. యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్‌తో రాబోతోన్న ఈ మూవీ అద్భుతంగా ఉండబోతోందని టీం నమ్మకంగా చెబుతోంది. ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఆది సాయి కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చుట్టూ రౌడీలు, ఒంటిపై గాయాలు, రక్తం మరకలు చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేట్టుగానే కనిపిస్తున్నాయి. ఇక ఆది లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా, అగ్రెస్సివ్‌గా ఉంది. చేతిలో సిగరెట్ పెట్టుకున్న తీరు, ఆది కాస్టూమ్స్ ఇలా అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. కె. ఎస్. రవికుమార్ వద్ద పనిచేసిన దర్శకుడు గురు శరవణన్ ‘కూగల్ కుట్టప్ప’తో మంచి విజయాన్ని అందుకున్నారు. తన మూడో చిత్రమైన ‘ఈగో రాజా’తో శరవణన్ హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘శంబాల’ వంటి బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న ఆది సాయి కుమార్ ఈ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ‘కంజూరింగ్ కన్నప్పన’, ‘సట్టం ఎన్ కైయిల’ ఫేమ్ సతీష్ ఈ హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రంలో ఓ పాత్రను పోషిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు