విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : విజయవాడ కర్నూలు మధ్య ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు బుధవారం దిల్లీ నుంచి వర్చువల్గా దీనిని ప్రారంభించారు. వారానికి మూడు రోజులపాటు కర్నూలు- విజయవాడ మధ్య సర్వీసులను ఇండిగో సంస్థ నడపనుంది. ప్రయాణికుల రద్దీని బట్టి భవిష్యత్తులో ఈ సర్వీసును ప్రతిరోజూ ఉండేలా చర్యలు తీసుకుంటామని రామ్మోహన్నాయుడు తెలిపారు. అలాగే కర్నూలు నుంచి దేశంలోని మిగిలిన ముఖ్య నగరాలకు కూడా సర్వీసులు నడిపేలా చూస్తామన్నారు.
విమాన సర్వీసుల ప్రారంభ కార్యక్రమంలో పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి, కూటమి నేతలు, జిల్లా అధికారులు పాల్గొని ప్రయాణికులకు స్వాగతం పలికారు.
కర్నూలు – విజయవాడ విమాన సర్వీసుల ప్రారంభం
- Advertisement -


