Homeఅంతర్జాతీయంగడిచిన కాలం మళ్లీ రాదు

గడిచిన కాలం మళ్లీ రాదు

- Advertisement -

గల్ఫ్‌లో అమెరికా స్థావరాలకు రక్షణ ఉండదు
పశ్చిమాసియాపై పట్టుకోల్పోయిన అగ్రరాజ్యం
మరో 25 ఏళ్లలో ఇజ్రాయిల్ కనిపించదు
ఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ

తెహ్రాన్: గడిచిన కాలం తిరిగి రాదని, అమెరికాకు గల్ఫ్ దేశాలు ఇంకెప్పటికీ స్వర్గధామాలుగా ఉండవని ఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ వ్యాఖ్యానించారు. ఆయన టెలిగ్రామ్ వేదికగా మంగళవారం అమెరికానుద్దేశించి పోస్టు పెట్టారు. ‘అమెరికా స్థావరాలకు గల్ఫ్ రాజ్యాలు కవచాలుగా ఉండవు, ఈ ప్రాంతంలో వాషింగ్టన్‌కు ఇకపై స్వర్గధామం అంటూ ఏదీ లేదు. అమెరికాకు మునుపటి హోదా కూడా ఉండదు’ అని మొజ్తాబా పేర్కొన్నారు. మÖడు నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపడం కోసం తెహ్రాన్, వాషింగ్టన్ కసరత్తు క్రమంలో శాంతి చర్చలు జరుగుతున్న వేళ మొజ్తాబా తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. దక్షిణ ఇరాన్‌లో క్షిపణి స్థావరాలపై అమెరికా దాడులు, మైన్లు పరిచే పడవýపై విరుచుకుపడింది. ఈ సమయంలో మొజ్తాబా తాజా హెచ్చరికలు చర్చకు దారితీశాయి. ఇజ్రాయిల్‌ను తుడిచిపెట్టేస్తామని కూడా మొజ్తాబా ఖామేనీ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆ దేశం అంతానికి చేరువయ్యిందని వ్యాఖ్యానించారు. మరో 25 ఏళ్లలో ఈ దేశం కనిపించదని అన్నారు. పశ్చిమాసియా దేశాలు ఇకపై అమెరికా సైనిక స్థావరాలకు రక్షణ కవచాలుగా ఉండబోవని, అంతర్జాతీయంగా అమెరికా ప్రభావం రోజురోజుకూ తగ్గిపోతోందని టెలిగ్రాఫ్‌లో మొజ్తాబా పేర్కొన్నారు. ‘మీ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉండి, అక్కడ నుంచి ఇరాన్‌పై దాడులు జరిగితే మాత్రం కనికరం చూపేది లేదు’ అంటూ సౌదీ అరేబియా, యÖఏఈ, ఖతార్ సహా ఇరుగు పొరుగు దేశాలను హెచ్చరించారు. పశ్చిమాసియాపై అమెరికా పట్టు సడలిపోయిందని, అమెరికా ఎంత ప్రయత్నించినగానీ గడిచిన కాలాన్ని తిరిగి తేలేదని మొజ్తాబా వ్యాఖ్యానించారు. ‘కాల చక్రం వెనక్కి తిరగదు. ఈ భూభాగంలోని దేశాలు ఏవీ కూడా అమెరికా సైనిక స్థావరాలకు రక్షణ కల్పించబోవు. సైనిక స్థావరాలు ఏర్పాటు చేసేందుకు, దుందుడుకు చర్యలు చేపట్టేందుకుగాను ఈ ప్రాంతంలో అమెరికాకు స్వర్గధామాలు అంటూ ఏమీ ఉండవు’ అని ఖామేనీ ప్రకటన పేర్కొంది. అదే సమయంలో అమెరికాను ‘గ్రేట్ సేతన’ (పెద్ద సైతాను)గా, ఇజ్రాయిల్‌ను ‘టేమ్డ్ బీస్ట్ (లొంగదీసుకున్న మృగం)గా ఇరాన్ అధినేత వర్ణించారు. అదే సమయంలో తమ దేశ సాయుధ దళంపై ప్రశంసలు కురిపించారు. ‘మన ధీర ముజాహిదీన్, ఆత్మబలిదానానికి వెనుకాడని సాయుధ దళాలు తమ ఆయుధాలకు పదుపు పెంచాయి. క్షిపణలు, డ్రోన్లతో భూమి, గగనతలం, సముద్రంలో భీకర పోరు సాగిస్తున్నాయి. పెద్ద సైతాను అమెరికాను, దాని అదుపులోని మృగాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో విజయ పథంలో ముందుకెళుతున్నాయి’ అని మొజ్తాబా ఖామేనీ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు