న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. ఇది వీరిద్దరి రెండవ సమావేశం. నవంబరులో తొలిసారి భేటీ అయ్యారు. కాగా న్యూయార్క్ నగరంలో నూతన గహాల నిర్మాణానికి భారీ పెట్టుబడులపై మమ్దానీ, ట్రంప్ చర్చించారు. అధ్యక్షుడితో చర్చలు ఫలప్రదంగా సాగినట్లు మమ్దానీ అనంతరం ఎక్స్‌లో పేర్కొన్నారు. న్యూయార్క్‌లో మరిన్ని గహాల నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా, క్వీన్స్‌లోని సన్నీసైడ్ యార్డ్‌లో 12,000 కొత్త ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చేలా మామ్దానీ చేసిన ప్రతిపాదన విషయంలో ట్రంప్ సంతప్తి వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు వ్యయం 21 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. 50 ఏళ్లలో ఇంత భారీగా గహాలు, మౌలిక వసతుల పెట్టుబడులు పెట్టలేదని, ఈ ప్రాజెక్టు 30వేల ఉద్యోగాలు సష్టిస్తుందని మమ్దానీకి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆనా బహర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై ట్రంప్ సంతప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
ట్రంప్‌తో మమ్దానీ రెండో భేటీ
- Advertisement -
RELATED ARTICLES


