Homeసంపాదకీయంపౌరసత్వ మీమాంస వెనక…

పౌరసత్వ మీమాంస వెనక…

- Advertisement -

నీలం రంగు 36 పేజీల నుంచి 60 పేజీలు ఉండే చిరుపొత్తం. అది హాయిగా జేబులో ఇమిడిపోతుంది. దాని మీద మధ్యలో జాతీయ చిహ్నం ఉంటుంది. అడుగున భారత గణతంత్రం అని కూడా రాసి ఉంటుంది. ఆ పుస్తకం అట్ట దళసరి పదారœంతో చేసి ఉంటుంది. పాస్పోర్టు ఉన్నవారు భారతీయ పౌరులం అని గర్వంగా చెప్పుకుంటారు. ఏ దేశం వెళ్లినా భారతీయ పౌరులుగా గుర్తించే వారు. ఇప్పుడు అలా కుదరదట. ఏ దేశానికైనా వెళ్లి భారతీయ పౌరులం అని చెప్పుకున్నా వారు మనల్ని భారతీయ పౌరులుగా గుర్తించక పోవచ్చు. ఇంతకీ 143 కోట్ల జనాభా ఉన్న దేశంలో పాస్పోర్టు ఉన్న వారి సంఖ్య పది కోట్లకు కొంచెం అటూ ఇటూ మాత్రమే. మీరు భారత పౌరుడు అని నిరూపించుకోవడానికి ఓటరు గుర్తింపు, ఆధార్ కార్డు, పాన్ కార్డు చివరకు పాస్పోర్టు కూడా సరిపోవట. పాస్ పోర్టు జారీ చేయడానికి ముందు పెద్ద తంతే ఉంటుంది. పోలీసులు ముందుగా తర్వాత ప్రభుత్వ అధికారులు తగిన రీతిలో దర్యాప్తు చేస్తారు. పాస్పోర్టు కూడా భారత పౌరుడిగా గుర్తించడానికి పనికి రాకపోతే ఆ రుజువులు ఎవరు చూపుతారు. ప్రభుత్వాధికారులు నిర్ణయిస్తారా? ఇటీవల ప్రత్యేక, సునిశిత ఓటర్ల జాబితా సవరణ జరిగిన రాష్ట్రాలలో, ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ ఎవరు భారతీయ పౌరులు, ఎవరు కారు అన్న చర్చ లేవదీసింది. పౌరులెవరో ఎన్నికల కమిషన్ తేలుస్తుందా? పౌరులెవరు అన్న అంశం మీద చివరకు కచ్చితమైన సమాచారం మాత్రం ఎవరూ ఇవ్వలేదు.
గురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్పోర్టు భారత పౌరుడు అనడానికి సరిపోదని మాత్రం చెప్పేసింది. ప్రభుత్వ అధికారులు ఎవరిని కావాలంటే వారిని ఆ శాఖకు ఇష్టమైన వారిని పౌరులు అని తేలుస్తారేమో. ఇష్టం కాని వారిని మీరు పౌరులు కాదు పొమ్మంటారేమో? ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్కార్డు కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు జారీ చేసీనవే అయినప్పుడు ఇవి పౌరులు అని నిరూపించుకోవడానికి ఎందుకు పనికి రావో? మన దేశంలో పౌరసత్వ కార్డులు ఇచ్చే పద్ధతే లేదు. అలాంటప్పుడు ఉన్న ఆధారాలు పనికి రానప్పుడు లేని రుజువులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన వారు భారతీయ పౌరులు అవుతారు. కానీ ఇప్పుడు అలాంటి వారూ పౌరులు కారు అని ఎవరూ అభ్యంతరం లేవదీయలేదు. పాస్పోర్టు భారత పౌరసత్వం నిరూపించుకోవడానికి ఆధారం కాదు అంటున్నారంటే దీని వెనక ఏదో పెద్ద వ్యూహం ఉందనుకోవాలేమో! పాస్పోర్టు యథాలాపంగా జారీ చేసేది కాదు. లోతైన దర్యాప్తు జరిగితేనే కాని ఇవ్వరు. దేశ పౌరులందరి దగ్గర పాస్పోర్టులు ఉండకపోవచ్చు. ఈ దేశంలో పుట్టిన వారందరూ సహజంగానే భారత పౌరులవుతారు. అలాగని జన్మ ధృవీకరణ పత్రం కూడా పౌరసత్వ నిరూపణకు ఉపకరించదు. ఎందుకంటే జన్మ ధృవీకరణ పత్రంలో ఎవరి పేరూ ఉండదు. ఫలానా దంపతుల సంతానం అని మాత్రమే ఉంటుంది. జన్మ ధృవీకరణ పత్రం ప్రసవం ఆధారంగానే ఉంటుంది తప్ప ఎలాంటి దర్యాప్తూ జరగదు. అలాగే మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ నాగరికతను నిరూపిస్తుందా అంటే అదీ లేదు. అందులో పుట్టిన తేదీ కూడా ఉంటుంది. ఆ పుట్టిన తేదీనే తరవాత పుట్టిన తేదీకి ప్రమాణం అవుతుంది. దానికీ ఏ దర్యాప్తూ ఉండదు. పాన్కార్డు పన్ను చెల్లించే వారికీ, చెల్లించని వారికీ ఇస్తారు. అప్పుడూ ఎలాంటి దర్యాప్తూ ఉండదు. చాలామంది దగ్గర జన్మ ధృవీకరణ పత్రం లేకపోవచ్చు. మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ అక్కడి దాకా చదువుకున్న వారి దగ్గరే ఉంటుంది.
ఆధార్ కార్డు చాలామంది దగ్గర ఉంటుంది. కానీ అదీ పౌరసత్వానికి రుజువు కాదంటున్నారు. ఇన్ని పత్రాలనూ నిరాకరిస్తూ పోతే ఎవరైనా తమ పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకుంటారు ? పాస్పోర్టు కేవలం ప్రయాణానికి ఉపకరించే పత్రం మాత్రమేనని దాని ఆధారంగా పౌరసత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ఏమీ అందవని విదేశాంగ శాఖ అధికారి స్పష్టం చేశారు. పాన్కార్డు, రేషన్కార్డు తీసుకోవాలంటే ఆధార్ కార్డు అడుగుతారు. విమానాల్లో బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణించాలన్నా ఆధార్ కార్డు అడుగుతారు. ఆధార్ కార్డు ప్రాతిపదికగా జారీ చేసిన పాస్పోర్టు భారత పౌరసత్వం నిరూపించుకోవడానికి పనికి రాదంటే ఏమనుకోవాలి? దేశ విభజన తరవాత ఇక్కడి ప్రజలు పాకిస్థాన్కు, పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చినప్పుడు ఆ సమయంలో మారణోమం జరిగినప్పుడు కూడా పౌరసత్వం ఎన్నడూ ప్రశ్నార్థకం కాలేదు. మామూలు జనం పౌరసత్వం మీదే ప్రశ్నలు లేవనెత్తడం వెనక నిజంగానే ఏదో పెద్ద మాయాజాలం ఉండే ఉంటుంది. ఎవరు పౌరులు అని తేల్చే బాధ్యతను ఒకప్పుడు ఎన్నికల కమిషన్ నెత్తిన వేసుకుంది. ఒక్కోసారి విదేశాంగ మంత్రిత్వ శాఖ భుజాన వేసుకుంటుంది. అసలు ఈ వ్యవహారం చూడాల్సింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఆ శాఖ మాత్రం బయటకు కనిపించదు.
కానీ లోలోపల మిగతా శాఖలన్నింటినీ ఆడిస్తూ ఉంటుంది. పౌరసత్వం మీద పదేపదే ప్రశ్నలు లేవనెత్తడం వల్ల జనం ఆందోళన పడ్తున్నారు. 2025 ఆగస్టులో లోకసభలో సీపీఐ (ఎం.ఎల్.) సభ్యుడు సుధామా ప్రసాద్ గత పాతికేళ్లలో ఎంతమంది జన్మ ధృవీకరణ పత్రాలు తయారయ్యాయి అని అడిగితే కేంద్ర ోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అరకొర సమాచారం అయితే ఇచ్చారు కానీ ఈ సందర్భంగా ఏ పత్రాల ప్రస్తావనా తేలేదు. నాగరికత రుజువు చేసుకోవడానికి ఏయే పత్రాలు ప్రామాణికమైనవో కూడా మంత్రి చెప్పలేదు. పౌరసత్వం నిరూపించుకోవడానికి ఏయే పత్రాలు కావాలో ప్రభుత్వానికి కూడా తెలియకపోవచ్చు. కానీ జనాన్ని హడలగొట్టడానికి నిర్దిష్టమైన సమాచారం ఎవరికీ అక్కర్లేదుగా! దేశంలో అయిదేళ్లలోపు బాలల్లో 38 శాతం మందికి జన్మ ధృవీకరణ పత్రాలే లేవు. పుట్టినట్టు నమోదు అయిన వారందరి దగ్గరా ఈ పత్రాలు లేవు. పౌరసత్వాన్ని ఏ ఆధారంతో నిర్ధారించాలో ప్రభుత్వం ఇంతవరకు ఖరారు చేయలేదు. కానీ ఎవరి పౌరసత్వాన్ని ప్రశ్నార్థకం చేయాలో మాత్రం నిర్ణయించుకున్నట్టు ఉంది. కొన్ని దేశాలలో వేదనకు గురవుతున్న వారికి భారత పౌరసత్వం ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం అంగీకరించింది. కానీ అందులో ముస్లింలను మినహాయించారు. నిర్దిష్ట విధానం లేని ప్రభుత్వం పౌరసత్వం గురించి మాత్రం అనుమానాలు రేకెత్తిస్తోంది. మతలబు లేకుండా మోదీ ప్రభుత్వం ఏమీ చేయదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు