ముంబై : భారత్`న్యూజీలాండ్ జట్ల మధ్య ఈనెల 8వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పేలవఫామ్‌తో సతమతమవుతున్నప్పటికీ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను తుది జట్టులో కొనసాగించాలని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అతడు కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీల్లో 7 మ్యాచుల్లో కేవలం 89 పరుగులే చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే అర్ధసెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ
“అభిషేక్ శర్మను తుది జట్టులో కొనసాగించాలి. ఫైనల్ కోసం మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ‘నీ సామర్థ్యం మీద నువ్వు నమ్మకంతో ఉండు. తిరిగి పుంజుకో. ధైర్యం కోల్పోవద్దు’ అని అతడికి చెప్పాలి” అని రవిశాస్త్రి అన్నాడు. పైనల్‌లో అభిషేక్ రాణించే అవకాశముందని అతడు ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘మేం నీవెంటే ఉన్నాం. వెళ్లి ఆడు. ఫైనల్‌లో నువ్వు బాగా ఆడతావు’ అని రవిశాస్త్రి అభిషేక్‌నుద్దేశించి అన్నాడు. కాగా సంజు శాంసన్ తిరిగి రిథమ్‌లోకి వచ్చాడని రవిశాస్త్రి అన్నాడు. ‘మరింత నిలకడగా తాను ఆడాలన్న విషయాన్ని సంజుశాంసన్ గుర్తించాడు. అతడు ప్రస్తుతం తన షాట్ సెలక్షన్ విషయంలో మరింత తెలివిగా వ్యవహరిస్తున్నాడు. తిరిగి అతడు పుంజుకున్నాడు. అతడి అమ్ముల పొదిలో చాలా షాట్లున్నాయి’ అన్నాడు.
ఫైనల్‌లో అభిషేక్‌ను ఆడించాలి: రవిశాస్త్రి
- Advertisement -


