Homeమోదీ సర్కారుఘోర వైఫల్యం

మోదీ సర్కారుఘోర వైఫల్యం

- Advertisement -

. పరీక్షా వ్యవస్థను పతనం చేశారు
. తీవ్రంగా ఖండించిన సీపీఐ
. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు డిమాండ్

పేపర్ లీక్‌లు, భారీ అవకతవకల నేపథ్యంలో నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండించింది. ఎన్‌టీఏ, మోదీ ప్రభుత్వం సర్కారు ఘోర వైఫల్యం కారణంగా ఎంతో వ్యయప్రయాసల కోర్చి చదువుకున్న లక్షలాది మంది విద్యార్థులు మరోసారి శిక్షకు గురయ్యారని మండిపడింది.

న్యూదిల్లీ: పేపర్ లీక్‌లు, భారీ అవకతవకల నేపథ్యంలో నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండించింది. ఎన్‌టీఏ, మోదీ ప్రభుత్వం సర్కారు ఘోర వైఫల్యం కారణంగా ఎంతో వ్యయప్రయాసల కోర్చి చదువుకున్న లక్షలాది మంది విద్యార్థులు మరోసారి శిక్షకు గురయ్యారని మండిపడింది.
ఈ మేరకు సీపీఐ జాతీయ సమితి ప్రకటన విడుదల చేసింది. ఇది యాదృచ్ఛికం కాదని…ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందని సీపీఐ పేర్కొంది. పదేపదే జరుగుతున్న పేపర్ లీక్‌లు, పరీక్షల కుంభకోణాలు, రద్దులు… మోదీ ప్రభుత్వంలో పరీక్షా వ్యవస్థ పతనాన్ని బట్టబయలు చేశాయని విమర్శించింది. కోచింగ్ సెంటర్లు, ఉన్నత వర్గాలకు ప్రయోజనం చేకూర్చే తీవ్ర వివక్షాపూరిత వ్యవస్థను ముందుకు నెడుతూ మోదీ ప్రభుత్వం పేద, గ్రామీణ విద్యార్థుల ఆశలను పదేపదే కాలరాసిందని తెలిపింది. అసలు నీట్ పరీక్షే అన్యాయమైనది, వివక్షాపూరితమైనదని సీపీఐ పునరుద్ఘాటించింది. తాజా వైఫల్యం కేంద్రీకృత పరీక్షా విధానం నిష్పాక్షికతకు, విశ్వసనీయతకు ఏమాత్రం విలువ ఇవ్వలేదని మరోసారి రుజువు చేసిందని తెలిపింది. నీట్ , ఎన్‌టీఏలను రద్దు చేసి… పరీక్షా విధానాన్ని ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా వికేంద్రీకరించాలని … తాజా పేపర్‌లీక్ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని… విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన దోషులందరినీ గుర్తించి…వారిని కఠినంగా శిక్ష విధించాలని డిమాండ్ చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు