Homeక్రీడలుషూటింగ్ ప్రపంచకప్ముకేశ్`పలక్ ద్వయానికి స్వర్ణ పతకం

షూటింగ్ ప్రపంచకప్ముకేశ్`పలక్ ద్వయానికి స్వర్ణ పతకం

- Advertisement -

గ్రెనెడా (స్పెయిన్): తెలుగు తేజం నేలవల్లి ముకేశ్ ఐఎసఎసఎఫ్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ ప్రపంచకప్‌లో రికార్డు సృష్టించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పలక్‌తో కలిసి ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన ఫైనల్ ఈవెంట్‌లో పలక్-ముకేశ్ 487.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఆదినుంచే అద్భుతమైన గురితో ఆకట్టుకున్న ఇండియా షూటర్లు ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. దాంతో పలక్ 243, ముకేశ్ 244.7 పాయింట్లు రాబట్టారు. చైనా షూటర్లు క్వియాన్‌జున్-కాయ్ హో 484.8 పాయింట్లతో రజతం నెగ్గింది. హంగేరికి చెందిన వెరోనికా మేజర్–అకోస్ కరోలీ 414.9 పాయింట్లతో కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ ముకేశ్-పలక్ జోడీ ఆకట్టుకుంది. 581-17 ఎక్స్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఒలింపియన్ గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్న ముకేశ్…జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా కొనసాగుతున్నాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు