హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొత్త సినిమాకు సంగీత దర్శకుడి విషయంలో కోలీవుడ్‌లో చర్చ సాగింది. రొటీన్‌కు భిన్నంగా ఈసారి తన చిత్రం కోసం వర్ధమాన సంగీత దర్శకుడిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్ ఇచ్చిన అప్‌డేట్‌తో ఈ రూమర్లకు చెక్ పడినట్లైంది. తమ సినిమా ఆడియో రైట్స్ సోనీ మ్యూజిక్ సొంతం చేసుకొందని తెలియజేస్తూ ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పేరు ఉంది. మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కానుండటంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాలో విజయ్ సేతుపతి – సాయి పల్లవి హీరోహీరోయిన్లు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ సినిమాతోనే రెహమాన్ సంగీత దర్శకుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతోనే ఈ కాంబోకు విశేష క్రేజ్ దక్కింది. మణిరత్నం తెరకెక్కించిన ‘బొంబాయి’, ‘సఖి’, ‘యువ’, ‘విలన’, ‘పొన్నియిన్ సెల్వన’ తదితర చిత్రాలకు రెహమాన్ స్వరాలు సమకూర్చారు. సేతుపతి విషయానికొస్తే… మణిరత్నం గతంలో రూపొందించిన ‘నవాబ’ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు.


