Homeక్రీడలుఅరంగేట్రం కోసం కుర్రాళ్ల ఎదురుచూపులు

అరంగేట్రం కోసం కుర్రాళ్ల ఎదురుచూపులు

- Advertisement -

ఐపీఎల్‌లో ఆ ఐదుగురిపైనే అందరి కళ్లు!

న్యూదిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)`2026కు సర్వం సిద్ధమైంది. ఈసారి కూడా వేలంలో కోట్లు పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, అండర్ 19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన కుర్రాళ్లపైనే అందరి చూపు ఉంది. సీఎస్‌కే, ముంబై, ఆర్సీబీ వంటి దిగ్గజ జట్లు ఈసారి కొత్త ప్రతిభను వెలికితీసే పనిలో పడ్డాయి. మైదానంలో అడుగుపెట్టకముందే తమ స్థాయి ఏంటో నిరూపించుకున్న అద్భుత ప్రతిభ గల ఐదుగురు యువ ఆటగాళ్లు ఈ సీజన్‌లో మైదానంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఒకరు వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మ… ఇతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మేనేజ్‌మెంట్ ఏకంగా 14.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మంచి ఫీల్డర్‌గా మాత్రమే కాకుండా, టాప్ ఆర్డర్‌లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే సత్తా కార్తీక్ సొంతం. ధోనీ వారసత్వాన్ని అందిపుచ్చుకునే క్రమంలో కార్తీక్ శర్మ సీఎస్‌కేకు అత్యంత కీలకం కానున్నాడు. ఇక సీఎస్కే 14.20 కోట్లకు దక్కించుకున్న మరో ప్రతిభావంతుడైన ఆటగాడు ప్రశాంత్ వీర్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను రవీంద్ర జడేజాకు దీటైన వారసుడిగా భావిస్తున్నారు. దేశవాళి టీ20ల్లో 170 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడంతో పాటు ఎంతో క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు.
దిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆకిబ్ నబీదార్
జమ్ముకశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ అకిబ్ నబీ దార్‌ను రూ. 8.40 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. వేలం నుంచే అకిబ్ క్రీడావర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాడు.
కశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో కీలక పాత్ర అకిబ్‌దే. 29ఏళ్ల అకిబ్ ఆ టోర్నీలో 60 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల ఆకిబ్, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో దిట్ట.
ఆర్సీబీ నుంచి విహాన్ మల్హోత్రా
ఆర్సీబీ కేవలం రూ.30 లక్షలకు దక్కించుకున్న 18 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం విహాన్ మల్హోత్రాపై ఆర్సీబీ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అండర్ 19 ప్రపంచకప్‌లో సెంచరీతో మెరిసిన విహాన్ మంచి గుర్తింపు అందుకున్నాడు. ముఖ్యంగా అతని స్టైలిష్ బ్యాటింగ్ ఒత్తిడిలో ఆడే తీరును చూసి చాలామంది శుభ్‌మన్ గిల్‌తో పోల్చుతున్నారు. రూ. 30 లక్షలకు ఆర్సీబీ దక్కించుకున్నప్పటికీ, టాప్ ఆర్డర్‌లో నిలకడగా రాణించగల సత్తా ఈ కుర్రాడికి ఉంది. కుదిరితే విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేయొచ్చు.
ముంబై ఇండియన్స్ నుంచి మహమ్మద్ ఇజార్
బీహార్‌కు చెందిన పేస్ సెన్సేషన్ మహమ్మద్ ఇజార్‌ను రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఈ కుర్రాడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 5 మ్యాచుల్లో 9 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వేగంగా బౌలింగ్ చేస్తూనే పరుగులు ఇజార్ ప్రత్యేకత. బుమ్రా మార్గదర్శకత్వంలో ఈ ఐదుసార్లు ఛాంపియన్ల జట్టుకు ఇజార్ ఒక ప్రమాదకర ఆయుధంగా మారనున్నాడు. అయితే ముంబయి బౌలింగ్ లైనప్ ఇప్పటికే పటిష్టంగా ఉంది. మరి ఈ కుర్రాడు దిగ్గజ ఆటగాళ్లను దాటి జట్టులో ఇజార్?కు చోటు దక్కుతుందో లేదో చూడాలి!

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు