Thursday, December 12, 2024
Homeఅంతర్జాతీయంఇళ్లపై కూలిన రవాణా విమానం

ఇళ్లపై కూలిన రవాణా విమానం

విల్నియస్‌: డీహెచ్‌ఎల్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 737 రవాణా విమానం సోమవారం లిథువే నియా రాజధాని విల్నియస్‌ విమానాశ్రయ సమీపంలోని ఇళ్లపై కుప్ప కూలింది. ఈ విమానం విమానాశ్రయంలో దిగడానికి కొద్ది నిమిషాల ముందు సమీపంలోని లిప్‌కల్నిస్‌ అనే ప్రాంతంపై పడిపోయింది. లిథువేనియా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 6గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. అగ్నిమాపక, సహాయక సిబ్బంది వేగంగా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విమానం జర్మనీలోని లీప్‌జిగ్‌ నుంచి బయల్దేరింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విమానాన్ని డీహెచ్‌ఎల్‌ కోసం స్విఫ్ట్‌ ఎయిర్‌ లైన్స్‌ అనే సంస్థ నిర్వహిస్తోంది. ప్రస్తుతానికి విమానా శ్రయంలోని మిగిలిన విమానాలను కూడా నిలిపివేశారు. మరోవైపు అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం మాత్రం ఈ విమానం కూలిన ఇళ్లల్లోని ప్రజలు సురక్షితంగానే ఉన్నారని తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు