వాషింగ్టన్: ఇరాన్‌పై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ కౌంటర్ టెర్రరిజం చీఫ్ జోసెఫ్ కెంట్ రాజీనామా చేయడంతో తమకు పెద్ద దెబ్బ తగిలిందన్న వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. ఇజ్రాయిల్ ఒత్తిడితోనే ఇరాన్‌పై యుద్ధాన్ని అమెరికా మొదలు పెట్టినట్లు కెంట్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. కెంట్ బలహీనుడని, ఆయన వెళ్లిపోవడమే మంచిదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కెంట్ రాజీనామా లేఖ చదివాను. ఆయన మంచివారని అనుకునేవాడిని కానీ, భద్రతా వ్యవహారాల్లో చాలా బలహీనుడు. ఇరాన్ ముప్ప్పు కాదనే వారు మాకు అక్కర్లేదు. వారు విజ్ఞులు కాదు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారు వెళ్లిపోవడమే మంచిది. ఇరాన్ ప్రతి దేశాని¿ ముప్ప్పు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, కెంట్ తన రాజీనామా లేఖలో ఇరాన్‌పై యుద్ధాన్ని ఆక్షేపించారు. ‘మనం ఎవరి కోసం ఈ యుద్ధం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మీరు కొత్త మార్గాన్ని ఎంచుకుని దేశాన్ని కాపాడవచ్చు. లేదా వినాశనం వైపు నడిపించవచ్చు. నిర్ణయం మీదే’ అని ఆయన ట్రంప్‌నుద్దేశించి అన్నారు.
కెంట్ రాజీనామా మంచిదే: ట్రంప్
- Advertisement -
RELATED ARTICLES


