విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : అమరావతి రాజధాని బిల్లును లొక్‌సభ ఆమోదించడం చారిత్రాత్మక ఘట్టమని విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ |ర్కొన్నారు. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” అని ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే రోజుకు పార్లమెంట్ వేదిక కావడం ఆనందదాయకమని ఆయన అన్నారు. ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నేపథ్యంలో, దానికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం కోట్లాది ప్రజల ఆకాంక్షకు నిదర్శనమని, అమరావతి విజయం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం అని వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలకు ఇది లభించిన ఫలితమని, శాంతియుత పోరాటానికి దక్కిన విజయమని లోకేష్ అన్నారు. కోట్లాది ప్రజల కోరికను గౌరవిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని తెలిపారు. చరిత్ర, సంస్కృతికి నిలయమైన అమరావతిని రాజధానిగా నిలిపినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తూ “జై ఆంధ్రప్రదేశ్.. జయహో అమరావతి” అని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
కేంద్ర నిర్ణయం ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టింది
- Advertisement -
RELATED ARTICLES


