ముంబయి: ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్, జైపూర్‌లోని తమ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (సిఐటి)లో ‘హీరో మోటోస్పోర్ట్స్ టీమ్ ర్యాలీ’ 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. గ్లోబల్ ర్యాలీ రేసింగ్ వేదికపై భారతదేశం ఎదుగుదలకు ఈ దశాబ్దం ఒక సజీవ ప్రతీకగా నిలిచింది. ఈ మైలురాయి వేడుకలో 2024 ఎఫ్ఐఎం వరల్డ్ ర్యాలీరైడ్ ఛాంపియన్ రాస్ బ్రాంచ్, దక్షిణ అమెరికాకు చెందిన నాచో కార్నెజో, దక్షిణాఫ్రికా ర్యాలీరైడ్, మోటోక్రాస్ రైడర్ మైఖేల్ డోచెర్టీ, భారతదేశపు మోటోక్రాస్, సూపర్క్రాస్ రైడర్ శ్లోక్ ఘోర్పడేలతో పాటు భారతదేశపు మొట్టమొదటి ప్రొఫెషనల్ మహిళా బైకర్లలో ఒకరైన సౌమ్య “మోక్ష” చౌదరి వంటి అగ్రశ్రేణి రేసింగ్ స్టార్లు పాల్గొన్నారు. ఈ వేడుకలో హీరో మోటోస్పోర్ట్స్ టీమ్ ర్యాలీకి చెందిన ముఖ్య రూపశిల్పులైన మోటోస్పోర్ట్స్ హెడ్, టీమ్ మేనేజర్ వోల్ÎÛగాంగ్ (వాఫీ) ఫిస్చర్, స్పానిష్ ర్యాలీ నిపుణుడు, నేషనల్ మోటోస్పోర్ట్స్ హెడ్ జోర్డి గ్రౌతో పాటు డీలర్లు, భాగస్వాములు, మోటోస్పోర్ట్స్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. హీరో మోటోస్పోర్ట్స్ టీమ్ ర్యాలీ తమ రెండవ దశాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, తమ ర్యాలీ రేసింగ్ ప్రయాణ భవిష్యత్తును తీర్చిదిద్దే మూడు వ్యూహాత్మక కార్యక్రమాలను కంపెనీ ప్రకటించింది.
గ్లోబల్ ర్యాలీ రేసింగ్‌లో హీరో మోటోస్పోర్ట్స్ టీమ్ ర్యాలీ 10 ఏళ్ల అద్భుత ప్రస్థానం
- Advertisement -


