విశాలాంధ్ర – ధర్మవరం; ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో గణపతి హోమం, వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మూలవిరాట్ కు అభిషేక కార్యక్రమాల అనంతరం, వాసవి కన్యకలతో స్థానిక పాండురంగ స్వామి దేవాలయం నుంచి ప్రధాన కలశములతో ఊరేగింపుగా అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సాయంకాలం అగ్నిగుండ ప్రవేశం, అమ్మవారి విశ్వరూప దర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరు రమణయ్య, దేవాలయ కమిటీ చైర్మన్ పిన్ను శ్రీనివాస ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్లంపల్లి సుదర్శన్ గుప్త, కార్యదర్శి తబ్జుల్ శ్రీనివాసులు, కోశాధికారి పిన్ను అశోక్ కుమార్, పి ఆర్ ఓ గ్రంధే శ్రీనివాసులు, రుసుముల కమిటీ చైర్మన్ ఎన్ఎస్ కృష్ణమోహన్, హరి, ప్రసాద్, వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు పోడమల రూప రాగిణి, నల్లపేట మంజు సంయుక్త, కాకుమాని కళ్యాణి, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కలవల నాగ తేజ, ఆర్యవైశ్య సంఘం వాటి అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు


