Homeఆంధ్రప్రదేశ్టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేశ్

టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేశ్

- Advertisement -

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లాకు మరోసారి అవకాశం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : టీడీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేశ్ నియమితులయ్యారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ బుధవారం ప్రకటించింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవాన్ని అధిష్టానం లెక్కలోకి తీసుకుంది. పని చేసే వారికే పార్టీలో పెద్దపీట అన్న సంకేతాన్ని పార్టీ ఇచ్చింది. కార్యకర్తే పార్టీకి అధినేత అన్న వినూత్న ఆలోచనలతో పార్టీని తిరుగులేని సైన్యంగా తీర్చిదిద్దుతున్న మంత్రి లోకేశ్‌కు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి పల్లా శ్రీనివాస్‌ను నియమించింది. సీనియర్లకు గౌరవం… కొత్త వారికి అవకాశాలు… సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగినట్టు తెలుస్తోంది. 29 మందితో పొలిట్ బ్యూరో నియామకాలు జరిగాయి. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇంఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్‌కు పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. 31 మందితో కూడిన జాతీయ కమిటీలో ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు కాగా 18 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 10 మందిని జాతీయ అధికార ప్రతినిధులుగా నియమించింది. రాష్ట్ర కమిటీలో 185 మంది ఉండగా వీరిలో ఏడుగురు రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు, 16 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు, 14 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు, 10 మంది రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్లు, 59 మంది రాష్ట్ర కార్యనిర్వాహక కార్యద ర్శులు, 77 మంది రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు. నాలెడ్జి కమిటీ, హెచఆర్‌డీ కమిటీల్లో ఒక్కొక్కరిని నియమించారు. గురువారం పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న శుభవేళ… టీడీపీ రాష్ట్ర కమిటీలోని 185 మందికి గాను 50 మంది మహిళలకు చోటు కల్పించింది. అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించింది.185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది (బీసీ-77, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13) బడుగులకు చంద్రబాబు నాయుడు చోటు కల్పించారు. పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియామకాలు జరిగాయి. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేశారు. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్ద పీట వేసినట్లు అధిష్టానం ప్రకటించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు