Homeఅంతర్జాతీయంట్రంప్‌ విధానాలపై ప్రజాగ్రహం

ట్రంప్‌ విధానాలపై ప్రజాగ్రహం

- Advertisement -

అమెరికా వ్యాప్తంగా నిరసనలు

వాషింగ్టన్‌: ట్రంప్‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా గురువారం ఆందోళనలు జరిగాయి. ఇమ్మిగ్రేషన్‌ ఆంక్షలు, ఆరోగ్య సంరక్షణలో కోతలకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. దేశంలోని 1,600కుపైగా ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.అట్లాంటా, సెయింట్‌ లూయిస్‌, ఓక్‌ల్యాండ్‌, కాలిఫోర్నియా, అన్నాపాలిస్‌, మేరీల్యాండ్‌ తదితర నగరాల్లో పెద్దఎత్తున నిరసనలకు పబ్లిక్‌ సిటిజన్‌ నాయకత్వం వహించింది. చికాగోలోనూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ట్రంప్‌ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనకారులు నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. డిపోర్టేషన్లు, ఇమ్మిగ్రేషన్‌ విధానాలను దుయ్యబట్టారు. దేశ చరిత్రలోనే భారీ ఉద్యమంగా ఈ నిరసన నిలవాలని కోరుకుంటున్నట్లు పబ్లిక్‌ సిటిజన్‌ సహ అధ్యక్షుడు లీసా గిల్బర్ట్‌ ఆన్‌లైన్‌ విలేకరుల సమావేశంలో వెల్లడిరచారు. నిరంకుశత్వం, చట్టబద్ధతలేని పరిపాలనతో అమెరికా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్వేచ్ఛ, హక్కులకు భంగం కలుగుతున్నదని, ప్రజాస్వామ్యం సవాళ్లను ఎదుర్కొంటున్నదని, ఈ పరిస్థితులను నివారించేందుకు ప్రజలు వీధుల్లోకి వచ్చారని గిల్బర్ట్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు