Homeహైదరాబాద్డా.తులసి రమణా చార్యులకు ఘన సత్కారం

డా.తులసి రమణా చార్యులకు ఘన సత్కారం

- Advertisement -

విశాలాంధ్ర, మల్కాజిగిరి : తెలంగాణ సాహిత్య అకాడమీ యమూ అండ్ మీ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్ర భారతి కాన్ఫరెన్స్హాల్లో తెలుగు సాహిత్యంలో విన్నూతన ప్రయోగం మనో వైజ్ఞానిక అంశాలతో మనశ్శాంతి జీవన క్రాంతి అనే అంశంపై కవితా పఠనం చేసినందుకు మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కవి రచయిత అర్చకులు డా.తులసి వెంకట రమణా చార్యులు కవి సమ్మేళనంలో పాల్గొని కవితా గానం చేసి సాహితీ ప్రియులను ఆకట్టుకున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.నమోజు బాలచారి, సైకాలజిస్ట్ యమూ అండ్ మీ కౌన్సిల్ింగ్ అండ్ పి.డి.సెంటర్ డా.సి.వీరేందర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డా.నందిని సిద్ధారెడ్డి చేతుల మీదుగా డా.తులసి వెంకట రమణా చార్యులుకు, ప్రశంసా పత్రం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కవులు రచయితలు సాహితీ వేత్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు