Thursday, December 5, 2024
Homeవ్యాపారండిఫెండర్‌ జర్నీ మూడో ఎడిషన్‌ ప్రారంభం

డిఫెండర్‌ జర్నీ మూడో ఎడిషన్‌ ప్రారంభం

ముంబయి: ప్రతిష్టాత్మకమైన డిఫెండర్‌ జర్నీస్‌ మూడో ఎడిషన్‌ ప్రారంభమైంది. ‘డిఫెండర్‌ జర్నీస్‌’ పేరుతో నిర్వహించే ఈ రైడ్‌… నవంబర్‌ 2024 నుంచి భారతదేశం మొత్తం 21 ప్రత్యేక ప్రాంతాల్లో జరుగుతుంది. డిఫెండర్‌ ఎస్‌యూవీలలో ఇది మొదటి-రకం, ఏకైక లగ్జరీ, సెల్ఫ్‌-డ్రైవ్‌, అనుభవపూర్వక ప్రోగ్రామ్‌. డిఫెండర్‌ వెహికల్‌ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆఫ్‌-రోడ్‌ వెహికల్‌. ఈ వెహికల్‌ ద్వారా భారతదేశంలోని అత్యంత సుందరమైన ప్రదేశాల అన్వేషించే అద్బుతమైన ప్రయాణమే ఈ డిఫెండర్‌ జర్నీస్‌ కార్యక్రమం. ఈ డిఫెండర్‌ జర్నీస్‌ లో ప్రతీ ప్రయాణం ఆలోచనాత్మకంగా రూపొందింది. ఈ ప్రయాణంలో మీకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, విభిన్న సంస్కృతులతో ముఖాముఖి, నోరూరించే వంటకాలు, ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ స్టేలు ఉంటాయి. కూర్గ్‌ లాంటి అద్భుతమైన కళ్లు తిప్పుకోనివ్వని సుందర దృశ్యాల నుంచి సువిశాలమైన తీర ప్రాంతాల వరకు లేదా హిమాలయాలలోని మంచుతో కప్పబడిన శిఖరాల వరకు, అలాగే థార్‌ ఎడారిలో ఉండే ఇసుక తిన్నెలు… ఇలా ప్రతీ ప్రయాణం అద్భుతంగా, చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేయబడిరది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు