దేశానికి జరిగే నష్టంతో పనిలేకుండా, కార్పొరేట్‌లపై ఇష్టంతో ప్రైవేటీకరణ దిశగా ఎన్‌డీఏ సర్కారు మరో అడుగు ముందు కేసింది. ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యమూల) విక్రయం ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, తాజాగా దేశంలో విశ్వసనీయమైన బీమా దిగ్గజం ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (జీవిత బీమా సంస్థఎల్‌ఐసీ)లో మరో 6 శాతం వాటాల విక్రయ ప్రక్రియను వేగ వంతం చేసింది. ఇప్పటికే తొలి విడత ఐపీవో రూపంలో కొద్దిపాటి వాటాను ఉప సంహరించుకున్న ప్రభుత్వం, ఇప్పుడు మరింత ముందుకు వెళ్లడం ఆందోళన కలిగించే అంశం. కోట్లాది మంది సామాన్య, మధ్య తరగతి ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఎల్‌ఐసీ వంటి మహావృక్ష±న్ని కొద్దికొద్దిగా పైవేట్ హస్తాలకు అప్పగించడం ఆర్థిక స్థిరత్వానికి శ్రేయస్కరం కాదని తెలిసీ, ప్రభుత్వం మూర్ఖంగా అదే పని చేస్తోంది. ఎల్‌ఐసీ పైవేటీకరణ దిశగా అడుగులు పదేళ్ల క్రితమే మొదలయ్యాయి. 1956లో ఏర్పాటైన నాటి నుంచి ఎల్‌ఐసీ కేవలం ఒక బీమా సంస్థగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక రంగానికి ప్రధాన వెన్ను ముకగా నిలిచింది. సంక్షోభ సమ యాల్లో దేశీయ మార్కెట్‌లను, విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఆదుకోవ డానికి ఎల్‌ఐసీ నిధులే ప్రాతిపదికగా నిలిచాయి. అత్యధిక శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంటూ, కోట్లాది మంది పాలసీ దారులకు నమ్మకాన్ని అందించిన ఎల్‌ఐసీ గత కొన్నేళ్లుగా అమ్మకాల దెబ్బలను అదే పనిగా తింటోంది. వాటాల విక్రయం పెరగడం వల్ల సంస్థ ప్రాథమిక లక్ష్యాలైన ‘సామాజిక భద్రత’, ‘ప్రజా సంక్షేమం’ వెనుకబడి, లాభాపేక్షే ప్రధాన ధ్యేయంగా మారే ప్రమాదం ఉందని ప్రధాని మోదీకి తెలియనిది కాదు. కాకపోతే కార్పొరేట్‌లకు మోకరిల్లనిదే పొద్దుగడవని ప్రభుత్వానికి ప్రైవేటు ముప్పు పట్టకపోవచ్చు. మోదీ ప్రభుత్వ పైవేటీకరణ విధానాలకు బహుశా ఇది అంత్యదశ కావచ్చు. 2014లో అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ‘కనీస ప్రభుత్వంగరిష్ట పాలన’ (మినిమ్మ గవర్నమెంట్మ్యాగ్జిమ్మ గవర్నెన్స్) అనే నినాదంతో పైవేటీకరణను ఒక వ్యూహాత్మక అజెండాగా మార్చుకుంది. ఈ దిశగా ప్రభుత్వం తీసుకున్న మెజారిటీ కీలక నిర్ణయాలు ప్రజావ్యతిరేకమైనవే. నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎంపీ) పేరుతో ప్రైవేటుబాట వేసింది. ప్రభుత్వ రంగానికి చెందిన రహదారులు, రైల్వేలు, విద్యుత్ లైన్‌లు, గ్యాస్ పైప్‌లైన్‌లు, స్టేడియాలు వంటి ఆస్తులను పైవేట్ రంగానికి లీజుకు ఇవ్వడం ద్వారా రూ.6 లక్షల కోట్లు సమీకరిం చడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఎయిర్ఇండియా విక్రయంతో ఊపందుకుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను పూర్తిగా టాటా గ్రూప్‌నకు విక్రయించడం ఈ వ్యూహంలో అతిపెద్ద ఘట్టం. అందులో భాగంగానే వ్యూహాత్మక రంగాలు, నాన్ స్ట్రాటజిక్ రంగాల పేరుతో విభజించి, ప్రభుత్వ రంగానికి సంబంధించి నూతన విధానాన్ని ప్రకటించింది. కేవలం అతికొద్ది వ్యూహాత్మక రంగాలలో అణుశక్తి, రక్షణ, అంతరిక్షం వంటివి మాత్రమే పరిమిత సంఖ్యలో ప్రభుత్వ సంస్థలను ఉంచి, నాన్`స్ట్రాటజిక్ రంగంలోకి మిగిలిన సంస్థలను చేర్చి, వాటిని పూర్తిగా పైవేటీకరించడం లేదా మూసివేయడం అనే నిర్ణయానికి వచ్చింది. ఇది ప్రభుత్వ రంగానికి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద దెబ్బ. బ్యాంకులు, ఐడీబీఐ పైవేటీకరణ చకచకా జరిగి పోయింది. ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాలను విక్రయించడంతో పాటు, పలు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి, రాబోయే రోజుల్లో మరో రెండు ప్రభుత్వ బ్యాంకులను పైవేటీకరించే దిశగా అడుగులు వేస్తోంది. పైవేటీకరణ వల్ల దేశానికి, ప్రజలకు జరుగుతున్న నష్టం అంచనాలకు అందనిది. ప్రభుత్వ రంగ సంస్థలు కేవలం లాభాలు ఆర్జించే మార్గాలు మాత్రమే కావు..అవి ఆర్థికంగా, సామాజికంగా భారతీయ సమాజంలో సమతుల్యతను కాపాడే సాధనాలు. ప్రైవేటీకరణ ఊపందు కుంటే, సామాజిక న్యాయానికి గండి పడుతుంది. ప్రభుత్వరంగ సంస్థలు వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడ్డాయి. సంపూర్ణ పైవేటీకరణ వల్ల ఆయా సంస్థల్లో రిజర్వేషన్ల వ్యవస్థ అమల్లో ఉండదు. ఇది సామాజిక న్యాయసూత్రాలకు పెద్ద విఘాతం కలిగిస్తుంది. అంటే పరోక్షంగా రాజ్యాంగాన్ని బలహీన పర్చడమే.ఉద్యోగ భద్రత లోపించడం ప్రైవేటీకరణ తెచ్చే మరో ముప్పు. పైవేట్ సంస్థల ప్రధాన ధ్యేయం ఖర్చుల తగ్గింపు, లాభాల పెంపు. దీనివల్ల నియామకాల సంఖ్య తగ్గడం, ఉన్న ఉద్యోగులను తగ్గించడం, కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ పద్ధతులను ప్రోత్సహించడం జరుగు తుంది. ఇది యువతకు శాశ్వత ఉద్యోగ అవకాశాలను దూరం చేస్తుంది. వైభవంగా వెలిగిన ఐటీ రంగం ఈ రోజున ఎలా పతనమైందో సాక్ష±త్కరిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలు గ్రామీణ ప్రాంతాలు, లాభసాటి కాని వెనుకబడిన ప్రాంతాల్లో సైతం సేవలను అందిస్తాయి. ఉదా: ఎల్‌ఐసీ సుదూర ప్రాంతాలకు సేవలను విస్తరించింది. కానీ పైవేట్ యాజ మాన్యంలోని బీమా సంస్థలు కేవలం లాభాలు వచ్చే నగరాలు, మెట్రో ప్రాంతాల పైనే దృష్టి పెడతాయి. ప్రజాధనంతో, దశాబ్దాల కృషి ద్వారా నిర్మించిన మౌలిక వసతులు, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు కొద్దిమంది పైవేట్ వ్యాపార దిగ్గజాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది ఆర్థిక అసమానతలను మరిన్ని రెట్లు పెంచుతుంది. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీ వంటి సంస్థలు ఏటా డివిడెండ్ల రూపంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపా యల ఆదాయాన్ని అందిస్తాయి. అటువంటి సంస్థల వాటాలను ఒక్క సారిగా విక్రయించి తాత్కాలిక బడ్జెట్ లోటును భర్తీ చేసు కోవడం అంటే, బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకోవడమే. ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో పీఎస్యమూల్లో రూ.80 వేల కోట్ల విలువ చేసే వాటాలను విక్రయిం చాలని మోదీ సర్కారు నిర్ణయించగా, ఇప్పటికే వివిధ సంస్థల వాటా విక్రయాల ద్వారా ప్రభుత్వం సుమారు రూ.21,200 కోట్లను సమీకరించు కుంది. ఎల్‌ఐసీలో 6 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించి, రూ.31వేల కోట్లుపైగా రాబట్టు కోవాలన్నది మోదీ ప్రభుత్వ యోచన. ఇందుకోసం ఎల్‌ఐసీ షేర్లను 10 శాతం తక్కువకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ దెబ్బతో ఒక్కసారిగా ఎల్‌ఐసీ షేర్లు 8.66 శాతం పతనమై, రూ.391.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా 9.26 శాతం పడిపోయాయి. గత నాలుగు మాసాల్లో అత్యంత కనిష్టస్థాయి ఇదే కావడం గమనార్హం. 2022లో తొలిసారిగా వాటాలను విక్రయించింది. నయా ఉదారవాద విధానాల్లో భాగంగా 70 ఏళ్ల విశ్వసనీయమైన సంస్థ ఎల్‌ఐసీని బలహీనపర్చడమే దీని ఉద్దేశం. బీమా చట్ట సవరణలు చేసి, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100శాతం వరకు పెంచి, ప్రైవేటు బీమా కంపెనీలు ప్రారంభించడానికి అవసరమైన భద్రతా మూలధన నిబంధనలను సడలించింది. ఇది ఎంత దారుణం. ఈ కుట్ర వెనుక ఉన్న పరమార్థం.. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని నిర్వీర్యం చేసి, కోట్లాది పాలసీదారుల పెట్టుబడి భద్రతను ప్రశ్నార్థకం చేయడమే. నష్టాల్లో ఉన్న, పునరుద్ధరించలేని సంస్థలను విక్రయించడం లేదా సరిదిద్దడం ఒక రకమైన నిర్ణయమైతే, దశాబ్దాలుగా నమ్మకమైన సేవలు అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు, బడ్జెట్‌కు భారీగా ఆసరాగా నిలుస్తున్న ఎల్‌ఐసీ వంటి మహత్తర సంస్థలలో వాటాలను విక్రయించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ప్రభుత్వరంగం అనేది కేవలం వ్యాపార వేదిక కాదు.. అది రాజ్యాంగం అందించిన సామాజిక, ఆర్థిక సమానత్వ సాధనానికి ఒక ప్రధాన మాధ్యమం. ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి జాతీయ ఆస్తులను విక్రయించే ధోరణిని పక్కనబెట్టి, ప్రభుత్వ రంగ సంస్థలను మరింత బలోపేతం చేస్తూ, వాటి యాజమాన్య నిర్వహణలో వృత్తిపరమైన మార్పులు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. బీమా రంగానికి భరోసాగా నిలిచిన ఎల్‌ఐసీ ప్రాధాన్యతను తగ్గిస్తూ పైవేటీకరణ వేగాన్ని పెంచడం దేశ భవిష్యత్తుకు శుభసూచకం కాదు.
దిశా నిర్దేశం లేని పైవేటు బాట!
- Advertisement -


