విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండలంలో ఉపాధ్యాయ సంఘం మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం జరిగింది. ఈ సమావేశం స్థానిక ఉపాధ్యాయ భవనంలో జిల్లా అధ్యక్షుడు కె. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా డి. కోదండ రావు, మండల ప్రధాన కార్యదర్శిగా సి. నాగేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన బాధ్యులు మాట్లాడుతూ నార్పల మండలంలో సంఘ అభివృద్ధి కోసం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సంఘ సభ్యులు రంగనాయకులు, రామకృష్ణ, గురు రాజా పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర మండలి సభ్యులు శివా రెడ్డి, వెంకటేశులు, పుల్లయ్య, మదన్ మోహన్, లక్ష్మీనారాయణ, రవి కుమార్ పాల్గొన్నారు. నార్పల మండల సీనియర్ నాయకులు యల్లప్ప, కిషోర్, క్రిష్టప్ప, రవి తదితరులు హాజరయ్యారు.


